Priyanka Gandhi : ప్రచారానికి వెళ్లిన ప్రియాంకకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పబోయి.. వీడియో వైరల్
X
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి వింత అనుభవం ఎదురైంది. ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ప్రియాంక పాల్గొన్నారు. వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు వేదిక మీద బొకే ఇచ్చి స్వాగతం పలికాడు. అయితే ఆ బొకేలో పువ్వులు లేవు.. అది చూసిన ప్రియాంక నవ్వు ఆపుకోలేక పువ్వులు ఏవీ అంటూ.. నవ్వేశారు. తప్పు తెలుసుకున్న ఆ నాయకుడు కూడా పొరపాటు గ్రహించి నాలుక కరుచుకున్నాడు. ప్రియాంక కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
गुलदस्ता घोटाला 😜
— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94
ఈ వీడియోపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ స్పందించారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశారు. ‘ఇదొక గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుండి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది’ అని రాశారు. ఈ నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రంలో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది, గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... కొద్ది రోజులకే జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ఏర్పడిన తిరుగుబాటు కారణంగా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీతో ఉన్నారు. నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనే నెలకొంది.