Talasani Srinivas Yadav : బీఆర్ఎస్ అభ్యర్థుల మార్పులు - చేర్పులను ఆయనే చూసుకుంటారు : తలసాని
X
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించామని.. అభ్యర్థుల మార్పులు, చేర్పులు సీఎం చూసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. దేశానికి కాంగ్రెస్ చేసిందేమి లేదని.. ఎన్నికల ముందు ఏదో హడావుడి చేస్తుందని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఇవాళ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. షెడ్యూల్ విడుదల అవ్వగానే 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.