Telangana assembly election 2023: లెక్క తేలింది.. ఏ వర్గానికి ఎన్నిటికెట్లంటే..?
X
తెలంగాణ ఎన్నికల్లో ప్రతీ పార్టీ వ్యూహాలు రచించే బరిలోకి దిగుతుంది. ఏ వర్గానికి చెందిన ఓటు బ్యాంకు చీలిపోకుండా.. అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే టికెట్ల కేటాయింపు విషయంలో కూడా వ్యవహరిస్తున్నాయి. కొన్ని స్థానాల మినహా ప్రతీ జిల్లాల్లో సమన్యాయ పాలనను పాటిస్తున్నారు. ప్రతీ పార్టీ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాయి. ప్రజలను, వర్గాలను ఆకట్టుకునేలా పథకాలు, హామీలను కూడా తీసుకొస్తున్నాయి. తామే ఫలానా వర్గానికి ప్రతినిధి, న్యాయం చేసేది అని చెప్పుకుంటున్నాయి. సామాజిక సమతుల్యతను పాటిస్తూ.. అన్ని వర్గాలకు సాధ్యమైనంత అవకాశాలు ఇస్తున్నాయి. ఏ వర్గం కూడా పార్టీకి దూరం కాకూడదని చూస్తున్నాయి. అందులో భాగంగానే ఏ పార్టీ ఏ వర్గానికి ఎన్ని టికెట్లు ఇచ్చిందో చూద్దాం..
బీఆర్ఎస్ పార్టీ కేటాయించిన టికెట్లు:
OC- 60
BC- 23
SC- 20
ST- 12
మైనారిటీ- 3
ఉత్తరాది- 1
కాంగ్రెస్ పార్టీ కేటాయించిన టికెట్లు:
OC- 58
BC- 23
SC- 19
ST- 12
మైనారిటీ- 6
బీజేపీ కేటాయించిన టికెట్లు:
OC- 44
BC- 36
SC- 21
ST- 10
మైనారిటీ- 0
బీజేపీ జనసేన పార్టీతో పొత్త పెట్టుకున్నందుకు గానూ 8 సీట్లను ఆ పార్టీకి కేటాయించింది. ఆ ఎనిమిది స్థానాల్లో 2 ఎస్టీకి, 3 బీసీకి, 2 కాపు, ఒక స్థానం ఓసీకి కేటాయించింది. ప్రధాన పార్టీలు ఇచ్చిన లెక్కలు వేసి ఎన్నికల్లో దిగుతుంటే.. ప్రజలు ఏ పార్టీకి అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంది.