Home > Trending/Popular > మృతులు 278 మంది.. బాలాసోర్‌కు ప్రధాని మోదీ

మృతులు 278 మంది.. బాలాసోర్‌కు ప్రధాని మోదీ

మృతులు 278 మంది.. బాలాసోర్‌కు ప్రధాని మోదీ
X

ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన బాలాసోర్ రైలు ప్రమాదంపై దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆదుకోవడానికి మేమున్నామంటూ నేతలు, యువత ముందుకొస్తున్నారు. ఒడిశా యువత పెద్ద సంఖ్యలో బాలాసోర్ చేరుకుని రక్తదానం చేస్తున్నారు. స్థానికులు పనులు వదిలేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పదుల సంఖ్యలో బోగీలు బొమ్మ రైళ్లలా పైకి ఎగిరి కిందపడ్డంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 278కి చేరుకుంది. క్షతగాత్రులను మరింత మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ప్రధాన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కోరమాండల్ రైల్లోని రాజమండ్రికి చెందిన పలువురు ప్రయాణికులు సుక్షితంగా ఉన్నట్లు తెలిసింది.




మరోపక్క.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిసతున్నారు. రైల్వే శాఖ ఉన్నతస్థాయి అధికారులతో ఆయన హుటాహుటిగా సమావేశమై ఈ ఘోరానికి కారణమేమిటో చెప్పాలని నిలదీసినట్టు తెలుస్తోంది. బాధితులను పరామర్శించడానికి ఆయన బాలాసోర్ వెళ్లనున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించాక కటక్ ఆసుపత్రిలోని క్షతగాత్రులతో మాట్లాడతారు. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇప్పటికీ స్పష్టమైన వివరాలు తెలియడం లేదు. బహానగా బజార్‌ స్టేషన్ సమీపంలో యశ్వంత్ పూర్- హౌరా, చెన్నై-షాలిమర్ కోరమాండల్ రైళ్లు, ఓ గూడ్సు రైలు ఢొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే కారణం ఏమిటి, ఏది దేన్ని ముందు డీకొట్టింది వంటి వివరాలను రైల్వే శాఖ ఇంతవరకు స్పష్టంగా వెల్లడించలేకపోతోంది. బాధితులు చెబుతున్న వివరాలకు, సంఘటన స్థలంలోని దృశ్యాలకు, అధికారులు చెబుతున్న వివరాలకు పొంతన కదురడం లేదు. రాత్రి కావడంతో గందరగోళం వల్ల ప్రమాద సమయంలో ఏం జరిగిందో చెప్పలేకపోతున్నామని స్థానికులు సైతం అంటున్నారు.





Updated : 3 Jun 2023 7:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top