Viral News : మూడో పెళ్లికి రెడీ అయిన 12 మంది పిల్లల తల్లి..వరుడికి కండీషన్స్ అప్లై
X
పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు ఎన్నో దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘చిన్న కుటుంబం- చింత లేని కుటుంబం’ అనే విధానాన్ని పాటించాలని మొత్తుకుంటున్నాయి. దీనికితోడు ధరలు పెరుగుతుండటంతో తల్లీదండ్రులు ఇద్దరు పిల్లలే చాలనుకుంటున్నారు. అయితే న్యూయార్క్‌కు చెందిన ఒక మహిళ మాత్రం నా రూటే సపెరేట్ అంటోంది. తనకు 12 మంది పిల్లలు ఉన్నా కూడా సంతృప్తి చెందడం లేదు.
వెరోనికా అనే ఈ మహిళ 14వ ఏటనే పెళ్లి చేసుకుని తల్లయ్యింది. అప్పటి నుంచి వరుసగా నాన్‌స్టాప్‌గా పిల్లలను కంటూ వచ్చింది. ఏమైందో ఏమో ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. అతనితోనూ పిల్లను కంది. ఇక 2021లో రెండవ భర్త నుంచి డివోర్స్ తీసుకుంది. ఇప్పుడు ఆమె వయసు 37 ఏళ్లు. ఆమెకు 12 మంది పిల్లలు ఉన్నారు. అయినా మూడో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది వెరోనికా. అయితే ఆ భర్తకు కూడా కొన్ని కండీషన్లు పెట్టింది. అది వింటే మాత్రం అందరూ అవాక్కవుతారు. అవును తనకు కాబోయే మూడో భర్తకు 10 మంది పిల్లలు ఉండాలని పాపం ఈ మహిళ ఆశపడుతోంది.
ఆమె మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అయితే తనకు కాబోయే భర్తకు ఇప్పుటికీ 10 మంది పిల్లలు ఉండాలనే కండీషన్ పెట్టింది. అప్పుడు తమ పిల్లల సంఖ్య 22 అవుతుందని అంటోంది. సోషల్ మీడియా వేదికగా వెరోనికా తన భావాలను వ్యక్తం చేసింది. ఆమెకు ఎక్కువ మంది పిల్లలను కనాలనే కోరిక ఉందని అందుకే తగిన భర్త కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే నాకు మూడో భర్త అవ్వాలనుకునే వారికి 10 మంది పిల్లలు ఉండాల్సిందే అని కండీషన్ పెట్టింది, అతని కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అప్పుడు తమ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుందని అంటోంది.. తద్వారా తమది బ్రిటన్‌లోనే అతిపెద్ద ఫ్యామిలీగా నిలుస్తుందని ఆశపడుతోంది వెరోనికా. మరి ఈ పిల్లల తల్లికి అలాంటి వరుడు దొరుకుతాడా?. మనమూ ఎదురుచూడాల్సిందే మరి.