Home > వైరల్ > గంగానదిలో అద్భుతం..నీటిలో తేలుతున్న శిల..

గంగానదిలో అద్భుతం..నీటిలో తేలుతున్న శిల..

గంగానదిలో అద్భుతం..నీటిలో తేలుతున్న శిల..
X

బిహార్‌ రాజధానిలోని గంగానది నదిలో భారీ శిలను స్థానికులు గుర్తించారు. ఇద్దరు యువకులు నదిలో ఈత కొడుతుండగా వింతైన రాయిని కనుగొన్నారు. ఆ రాయిని బయటికి తీసి చూడగా రామ్ అని అక్షరాలతో రాసివుండటంతో అంతా ఆశ్చర్యపోయారు. దాదాపు 14 కిలోల బరువున్న ఈ రాయి సిమెంట్ లాంటి ఆకృతిని కలిగి ఉంది, అయినప్పటికీ ఇది నీటిపై తేలుతుండటంతో ప్రజలంతా అవాక్కయ్యారు. ఈ శిలను రామయుగంలోని పవిత్రమైన కళాఖండంగా భావించి ప్రజలు భక్తితో పూజలు చేస్తున్నారు.

పట్నాలోని గంగానది రాజ్‌ఘాట్‌ దగ్గర ఈ అద్భుతమైన శిల లభించింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ రాయి గురించి పెద్ద చర్చ జరుగుతోంది. నదిలో తేలుతూ కనిపించిన ఈ రాయిపై ‘శ్రీరామ్‌’ అని రాసి ఉండటంతో భక్తులు రాముల వారి కాలం నాటి రాయి అని భావిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ గుడిలో నీటితొట్టిలో రాయిని ఉంచారు. ఈ వింతైన శిలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ రాయి దొరికిన రాజ్‌ఘాట్‌ పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని అక్కడి స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు ఇది రామసేతులోని రాయని, దానిపై పరిశోధనలు జరపాలని కోరుతున్నారు. శ్రావణ మాసంలో ఈ ప్రాంతంలో ఇలాంటి వింత సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు, గత ఏడాది బంగారు తాబేలును కనుగొన్నారు స్థానికులు.దానిని గంగానదిలోకి విడిచిపెట్టారు.



Updated : 27 Aug 2023 8:57 AM IST
Tags:    
Next Story
Share it
Top