Home > వైరల్ > స్క్రాప్ కారుకు వేలంలో రూ.15 కోట్లు.. అంత రేటు ఎందుకంటే ?

స్క్రాప్ కారుకు వేలంలో రూ.15 కోట్లు.. అంత రేటు ఎందుకంటే ?

స్క్రాప్  కారుకు వేలంలో రూ.15 కోట్లు.. అంత రేటు ఎందుకంటే ?
X

వింటేజ్ వస్తువులకు కాస్త డిమాండ్ ఎక్కువే. పురాతన కాలం నాటి అరుదైన వస్తువులంటే చాలా మందికి వ్యామోహం ఉంటుంది. వాటిపై మక్కువ ఎప్పటికీ చావదు. ప్రధానంగా వింటేజ్ కార్లంటే పడిచచ్చిపోయే జనాలు ఉన్నారు. ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడరు. వేలంలో కోట్లు పెట్టి దక్కించుకుంటారు. తాజాగా ఓ తుక్కు కారుకు భారీ ధర పలికింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెఎం సోథెబీ సంస్థ వింటేజ్ కార్స్ వేలం నిర్వహించింది. దీనిలో ఫెరారీ 500 మాండియల్ స్ఫైడర్ సిరీస్ 1 మోడల్ కారును ఉంచగా దానికి ఊహించని ధర పలికింది. టైర్లు ఊడిపోయి, ఎక్కడికక్కడ కాలిపోయి తుక్కుగా మారిన ఈ రేసు కారును ఏకంగా 1.87 మిలియన్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఇండియా కరెన్సీ ప్రకారం

అక్షరాల రూ.15 కోట్ల రూపాయలు అన్నమాట.

1960ల్లో ఓ రేసులో ఈ కారు ప్రమాదానికి గురైంది. ఇటాలియన్ రేసింగ్ డ్రైవర్ అల్బెరో అస్కరీ..1952, 53ల్లో వరుసగా సాధించిన ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ ఈ కారును తయారు చేసింది. ఫెరారీకి మొట్టమొదటి రేసింగ్ విజయాన్ని అందించిన డ్రైవర్ ఫ్రాంకో కోర్టేస్ 1954లో ఈ కారును కొనుగోలు చేశాడు. తర్వాత ఇది 1958లో అమెరికాకు తరలిపోయింది. వింటేజ్ కార్లకు వేలంలో అధిక ధర పలకడం సర్వసాధరణమే కానీ ఇలా తుక్కుగా మారిని కారును కోట్ల రూపాయలకు దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Updated : 20 Aug 2023 2:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top