ఏడాదిలో 100 మందితో డేటింగ్ చేయ్..కూతురిని ఎంకరేజ్ చేసిన తల్లి
X
ప్రేమలో పడ్డాం, రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అని ఎవరైనా పిల్లలు చెబితే అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటారు పేరెంట్స్. వారిని కొట్టడం, తిట్టడం, ఇంట్లో బంధించడం,లేదా ఇంటి నుంచి గెంటేయడం చేస్తుంటారు. ఇదంతా చాలా వరకు ఇళ్లల్లో కామన్‌గా కనిపించే విషయాలు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ వింటనూనే ఉంటాం. ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకించేవారు ఈ కాలంలో కూడా చాలా మందే ఉన్నారు. వయసొచ్చిన అమ్మాయిని అబ్బాయిలతో జాగ్రత్త అని ప్రతి అమ్మ సూచిస్తుంది. అలాంటిది ఓ తల్లి మాత్రం.. తన కూతుర్ని విభిన్నంగా ట్రీట్ చేసింది. అబ్బాయిలతో డేటింగ్ చేయమని ఎంకరేజ్ చేసింది. అందుకోసం కూతురికి బంపరాఫర్ కూడా ప్రకటించేసింది. ఏడాది కాలంలో 100 మంది అబ్బాయిలతో డేటింగ్ చేస్తే 500 డాలర్లు ఇస్తానని కూడా చెప్పింది. అమ్మ చెప్పినట్లుగా ఆ యువతి ఒక్క ఏడాదిలోనే 100 మందిని డేట్ చేసింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విడ్డూరమైన వార్త విన్నవారంతా అమ్మ తీరుకు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
ఈ అరుదైన సంఘటన బ్రిటన్‌లో జరిగింది. ఒక అమ్మ ఇప్పటి వరకు ఏ తల్లి ఇవ్వని బంపర్ ఆఫర్‌ను తన కూతురికి ఇచ్చింది. వంద మందితో డేటింగ్ చేయమని టార్గోట్ ఇచ్చింది. వంద మందితో డేటింగ్ చేస్తే ఖర్చులకు 500 డాలర్లు ఇస్తానని తల్లి అనడంతో కక్కుర్తి పడిని కూతురు తన అందంతో అబ్బాయిలకు గాలం వేసింది. ఏడాది వ్యవధిలోనే 100 మందితో డేట్ చేసింది. ఒకరి తరువాత ఒకరు అలా తన బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసింది. దీంతో తల్లి ఇస్తానన్న 500 డాలర్లను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్‌టాక్‌లో వెల్లడించింది. దీంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సక్సెస్ ఫుల్‌గా వందమందితో డేటింగ్ పూర్తి చేసిన కూతురికి గ్రాండ్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది తల్లి. ఓ పెద్ద కేక్‌ను తీసుకువచ్చి కూతురితో కట్ చేయించింది. అయితే ఈ వేడుకలకు వచ్చిన వాళ్లందరూ తల్లి తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కుమార్తెతో ఎందుకు ఇలా చేయించావంటూ తల్లిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు తన కూతురు ఎవరికీ ఎప్పుడూ సమాజంలో ఉన్న పురుషులకు భయపడకూడదనే ఉద్దేశంతో ఈ ఐడీయా ఇచ్చాని తల్లి చెప్పింది. దీంతో పార్టీకి వచ్చిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంత మంది తల్లి ఐడియాను స్వాగతించగా మరికొందరు మాత్రం ఇదేం పిచ్చిరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు.