Home > వైరల్ > మిత్రుడు శోభనానికి విషెస్ చెబుతూ బ్యానర్..

మిత్రుడు శోభనానికి విషెస్ చెబుతూ బ్యానర్..

మిత్రుడు శోభనానికి విషెస్ చెబుతూ బ్యానర్..
X

రాజకీయనాయకులకు, సినిమా రిలీజ్ సమయంలో అభిమాన హీరోలకు బ్యానర్లు కట్టడం సర్వసాధారణం. ఇటీవల చిన్న సెలబ్రేషన్స్‌కు, కల్చరల్ ఫంక్షన్లకు,పండగలకు పబ్బాలక కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ పెడుతున్నారు. స్నేహితుడి పెళ్లి అని, పుట్టిన రోజు అని సందర్భాన్ని బట్టి ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓ వ్యక్తికి అతడి ఫ్రెండ్స్ ఊహించని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏకంగా శోభనానికి విషెస్ చెబుతూ బ్యానర్లు కట్టారు. గ్రామమంతా ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. వినడానికి కొత్తగా, చెత్తగా ఉన్న ఘటన కర్ణాటకలో జరిగింది.

మంగళూరులో ఓ యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. అతడు భార్యతో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి హనీమూన్‌కు సిద్ధమయ్యాడు. అయితే అతని స్నేహితులు వినూత్నంగా ఆలోచిస్తూ ఫస్ట్‎నైట్ కోసం బ్యానర్లు ఏర్పాటు చేశారు. "రాత్రంతా పోరాడి గెలువు మిత్రమా.." అంటూ విష్ చేశారు. అంతే కాకుండా జూన్ 12న రాత్రి 12 గంటలకు అంటూ ముహర్తం అని కూడా రాశారు. ప్రస్తుతం ఆ బ్యానర్ల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిని వారు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్నేహితులు చేసిన కొంటె పనిని తిడుతుంటే..మరికొందరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.


Updated : 16 Jun 2023 10:05 PM IST
Tags:    
Next Story
Share it
Top