Home > వైరల్ > ‘నువ్వేమైనా శివుడివా’.. మెట్రోలో పాముతో ప్రయాణికుడి స్టంట్

‘నువ్వేమైనా శివుడివా’.. మెట్రోలో పాముతో ప్రయాణికుడి స్టంట్

‘నువ్వేమైనా శివుడివా’.. మెట్రోలో పాముతో ప్రయాణికుడి స్టంట్
X

ఓ వ్యక్తి తన పెంపుడు జంతువుతో మెట్రో ప్రయాణం చేశాడు. అది చూసిన తోటి ప్రయాణికచులు బెంబేలెత్తిపోయారు. అతనిపై అధికారులపై ఫిర్యాదు కూడా చేశారు. తన పెట్ తో ప్రయాణిస్తే తప్పేంటి అంటున్నారా. అతను ప్రయాణించింది.. కుక్కనో, పిల్లో కాదు. భయంకరమైన పాముతో. ఈ ఘటనంతా వీడియో తీసిన తోటి ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడా.. నెట్టింట్లో చర్చగా మారింది. పాముతో ప్రయాణించి అతనిపై నెట్టింట్లో ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోలో భారీ పామును మెడలో వేసుకుని ప్రయాణించాడు. ఈ వీడియోను unilad అనే ఇన్ స్టా ఐడీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మెట్రో అధికారులపై మండిపడుతున్నారు. మరోసారి మెట్రా సిబ్భంది పనితీరు వార్తల్లో నిలిచింది. అంతపెద్ద పామును మెట్రోలో తీసుకొస్తుంటే సిబ్భందికి కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి చేష్టలు తప్పని.. అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated : 30 July 2023 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top