కేమరపట్టి దుమ్మురేపిన సీమ దసర ‘ఫారిన్’ చిన్నోడు.. వైరల్ వీడియో
X
చిన్నపెద్ద తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. దానికి తోడు టిక్ టాక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట ఫామ్స్ ఎక్కువగా రావడంతో ఎవరిటాలెంట్ ను వారు చూపిస్తున్నారు. కొన్ని పాటలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియోలో ట్రెండ్ అయ్యాయి. వాటిలో నీ బుల్లెట్టు బండిక్కె వచ్చేత్త పా..అనే పాట ఒకటి కొన్ని రోజులు క్రితం మార్మోగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఈ పాటే వినిపించేది. ఇటీవల నాని దసరా సినిమాలో చమ్కీల అంగీలేసి పాట సోషల్ మీడియాను ఊపేసింది. చాలామంది ఈ పాటకు తమదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి రాత్రికి రాత్రే స్టార్స్ గా మారిపోయారు.
ప్రస్తుతం ’కేమరపట్టి దుమ్మురేపిన సీమ దసర చిన్నోడు‘ జానపద సాంగ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతోంది. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, వంటి వాటిలో దుమ్మురేపుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.కోట్లాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.ఈ పాటకు ఓ వ్యక్తికి ఒకరు గొడుగు పట్టుకొని ఉండగా వారి వెనుక కెమెరామ్యాన్ వస్తూ ఫోటోలు తీస్తుంటాడు. కెమెరామెన్, ఆ యువతి ఇద్దరూ కూడా ఒక రిథమ్‌లో డ్యాన్స్ చేస్తుంటారు.ఈ స్టెప్పులు చాలా సింపుల్ కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సింపుల్ డ్యాన్స్ స్టెప్పులను వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ పాట స్టెప్పులే కనిపిస్తున్నాయి.
తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ చేస్తున్న డ్యాన్స్ వైరల్ అవుతోంది. ఓ పెళ్లిలో బంధువులతో కలిసి ఆ ఫోటోగ్రాఫర్ కెమెరా పట్టుకొని స్టెప్స్ వేశాడు. అతడి డ్యాక్స్‌కు అక్కడి ఉన్నవారతంతా ఫిదా అయ్యారు. దీనికి కెమెరా పట్టినడో సీమ దసరా ఫారిన్ చిన్నోడు..అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోకు సీమ దసరా పాటను జోడించి వైరల్ చేస్తున్నారు.
if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5
— Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023