ముద్దుపెట్టి చంపేసింది...
X
నిజానికి ఇది ఇప్పుడు జరిగింది కాదు...ఎప్పుడో 2016లో జరిగిన సంఘటన. అయితే తాజాగా ఏఐతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి రావడంతో మళ్ళీ ఈ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే....ప్రియురాలు ముద్దు పెడితే ప్రియుడు చనిపోయాడు. ముద్దు పెడితే చనిపోవడం ఏంటి...వింతగా ఉందే అనుకుంటున్నారా...నిజం...హికీ అనే టైప్ ఆఫ్ ముద్దు వలన ఓ కుర్రాడు చనిపోయాడు.
మెక్సికోకి చెందిన జూలియో మాసియస్ గోంజాలెజ్ ఒకరోజు సడెన్ గా తన ఇంట్లో పేరెంట్స్ తో కలిసి భోజనం చేస్తూ కుప్పకూలిపోయాడు. అంతకు ముందు రోజు అతడు తన ప్రియురాలితో కలిసి డేట్ కు వెళ్ళాడు. అప్పుడు ఆమె గోంజాలెజ్ కు హికీ ముద్దు పెట్టింది. హికీ అంటే ఘాటు ముద్దు అని అర్ధంట. దీన్న లవ్ బైట్ అని కూడా పిలుస్తారు. శరీరం మీద పెదాలతో గట్టిగా అదిమిపెట్టి పీలుస్తారుట ఈ ముద్దు పెట్టినప్పుడు. మెడ, చెయ్య, చెవుల దగ్గర ఈ రకమైన ముద్దులు పెట్టుకుంటారు. జూలియో , తన ప్రియురాలు తరచూ ఇలా ముద్దులు పెట్టుకునేవారుట.
డేట్ నైట్ లో కూడా ఇలానే చేసుకున్నారు జూలియో అతని ప్రియురాలు. తరువాత అతను మామూలుగానే ఇంటికి వచ్చాడు. కానీ మర్నాడు భోజనం చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆంబులెన్స్ లో జూలియోను హాస్పటల్ కు తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. తరువాత పరీక్షలు చేయగా హికీ వల్లనే చనిపోయాడని తెలిసిందట. బలవంతంగా ముద్దు పెట్టడం వల్ల చర్మం కింద రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయి...మెదడుకు రక్తం సరఫరా అవలేదు. అందువల్లనే జూలియో మరణించాడు. ఈ సంఘటన తర్వాత అతని ప్రియురాలు పారిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో టిక్ టాక్ లో చక్కర్లు కొడుతోంది. ఏఐ టెక్నాలజీతో జూలియో రూపంతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తాను ఎలా చనిపోయాడో స్వయంగా అతనే చెబుతున్నట్టు ఉంటుంది. అయితే దీన్ని ఎవరు రూపొందించారో మాత్రం తెలియదు. ముద్దులతో చంపేయడమంటే ఇదా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.