Home > వైరల్ > బస్సు ఖాళీ లేదని డ్రైవర్ సీటులో కూర్చుంది..లేవమంటే గొడవ..వీడియో వైరల్

బస్సు ఖాళీ లేదని డ్రైవర్ సీటులో కూర్చుంది..లేవమంటే గొడవ..వీడియో వైరల్

బస్సు ఖాళీ లేదని డ్రైవర్ సీటులో కూర్చుంది..లేవమంటే గొడవ..వీడియో వైరల్
X

రద్దీగా ఉన్న బస్సుల్లో సీట్ల కోసం గొడవలు కామన్. కొన్నిసార్లు ఆడవాళ్లు సిగపట్లు కూడా పడతారు. సీటు నాదంటే నాదని వాదనకు దిగుతారు. అయితే ఇక్కడ ఓ మహిళ కూడా సీటు కోసం నానా హంగామా చేసింది. ఏకంగా డ్రైవర్ సీట్లోనే కూర్చొని ఇది నా సీటు అంటూ వాదించింది. అతడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తన అత్తతో కలిసి డ్రైవర్‌తో గొడవకు దిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవతున్న ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.

వైరల్ అయిన వీడియో ప్రకారం..ఓ మహిళ డ్రైవర్ సీట్లో కూర్చుంది. ఇంతలో అక్కడకు వచ్చిన డ్రైవర్..తన సీట్లో లేవమని బస్సు డ్రైవ్ చేయాలని చెప్పాడు. ఆ మహిళ ఇది నీ సీటు కాదు నా సీటు, కావాలంటే నువ్వే వెళ్లి వేరెక్కడైనా కూర్చుని బస్సు నడపమని సలహా ఇచ్చింది. డ్రైవర్ ఎంత చెప్పినా ఆమె వినలేదు. తిరిగా ఆమె అత్త కూడా కోడులకు వత్తాసు పలికింది. ఇద్దరు కలిసి డ్రైవర్‎తో గొడవకు దిగారు. వేరే సీటులో కూర్చొని డ్రైవింగ్ చేయమని..ఈ సీటు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. డ్రైవర్ ఎంతా చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక ఆమెను బలవంతంగా సీట్లోంచి కిందకు లాగేశాడు. అయితే ఈ సంఘటన ఎక్కడజరిగిందన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. రెండు నెలల కిందంట జరగగా ఇప్పుడు వైరల్ అవుతోంది.


Updated : 13 Jun 2023 6:47 PM IST
Tags:    
Next Story
Share it
Top