Home > వైరల్ > 3 సెకన్ల వీడియోలు చేస్తూ వందలకోట్ల ఆదాయం

3 సెకన్ల వీడియోలు చేస్తూ వందలకోట్ల ఆదాయం

3 సెకన్ల వీడియోలు చేస్తూ వందలకోట్ల ఆదాయం
X

ఓ మహిళ వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తోంది. అది కూడా 3 సెకన్ల వీడియో చేస్తూ ఆ మహిళ వారంలో ఇలా ఆదాయాన్ని పొందుతోంది. చైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జెంగ్ జియాంగ్ అనే మహిళ ఆన్‌లైన్ వీడియోల ద్వారా ఇలా సంపాదిస్తోంది. వస్తు ఉత్పత్తులకు రివ్యూలు ఇస్తూ ఆమె భారీగా డబ్బులు పొందుతోంది. ఆన్‌లైన్ ఉత్పత్తుల ప్రమోషన్లలో ఆమె ఇలా రివ్యూలు చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తోంది.

జెంగ్ జియాంగ్ అనే ఆ మహిళ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రోడక్టులకు రివ్యూలు ఇస్తూ ఉంటుంది. ఓ కంటైనర్ లోని వస్తువులను తీసుకుని ఒక్కొక్కటిగా ఆమె దాని గురించి వివరాలను తెలియజేస్తూ ఉంటుంది. కేవలం 3 సెకన్లలోనే ఆమె అలా వస్తువుల గురించి వివరాలను తెలియజేస్తుంటుంది. వస్తువులను కెమెరాకు చూపించి ఆమె రివ్యూలు చెప్పడంతో ఎంతో ఫేమస్ అయ్యింది. కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే ఆమె వస్తువుల గురించి చెప్పడం పూర్తవుతుంది.

ఆ చైనా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇస్తున్న రివ్యూలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆమెకు నమ్మశక్యంకాని రీతిలో వారికి 14 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ.120 కోట్లను ఆమె సంపాదిస్తోంది. మరోవైపు ఆమె రివ్యూ ఇచ్చే ఉత్పత్తులకు మంచి అమ్మకాలు కూడా లభించడంతో భారీగా సంపాదిస్తోంది. టిక్ టాక్ చైనా వెర్షన్ అయిన 'డౌయిన్'లో జెంగ్ జియాంగ్‌కు ఏకంగా 5 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉండటం విశేషం.

Updated : 8 Feb 2024 7:49 PM IST
Tags:    
Next Story
Share it
Top