Home > వైరల్ > బంతిని దాచేసిన బ్యాట్స్ మెన్...అతని వెనుక పరుగులు తీసిన వికెట్ కీపర్

బంతిని దాచేసిన బ్యాట్స్ మెన్...అతని వెనుక పరుగులు తీసిన వికెట్ కీపర్

బంతిని దాచేసిన బ్యాట్స్ మెన్...అతని వెనుక పరుగులు తీసిన వికెట్ కీపర్
X

ఇటు పదకొండు మంది అటు పదకొండు మంది సీరియస్ గా ఆడే ఆట క్రికెట్. ఒకరి మీద ఒకరు గెలవాలని చాలా పట్టుదలగా ఆడతతారు. అయితే ఇందులో కూడా అప్పుడప్పుడూ ఫన్నీ సన్నివేశాలు ఎదరవుతుంటాయి. ప్లేయర్స్ ప్రవర్తన, సరదాగా చేసే పనులు అందరి మొహాల్లోనూ నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఫన్నీ ఇన్సిడెంటే ఒకటి జరిగింది శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరుగుతన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో.

శ్రీలంకలోని గాలె స్టేడియంలో పాకిస్తాన్, శ్రీలంక లమధ్య మొదటి టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 312 పరుగులు చేసింది.తరువాత పాక్ 9 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసింది. అప్పటికి క్రీజులో అబ్రార్ అహ్మద్, సౌద్ షకీల్ ఉన్నారు. లంక స్పిన్నర్ రమేష్ మెండిస్ 120వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్లోని నాలుగో బంతిని అబ్రార్ డిఫెన్స్ ఆడాడు. అయితే ఆబాల్ ఎక్కడకూ వెళ్ళకుండా అతని చేతిని తాకి కాలికున్న ప్యాడ్‌లో ఇరుక్కుపోయింది. అది చూసిన లంక వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ బంతిని తీసుకునేందుకు వచ్చాడు. అయితే అబ్రార్ అహ్మద్.. సదీర సమరవిక్రమని బంతిని తీసుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. అతడిని పక్కకు తోసేస్తూ.. తన ప్యాడ్లోని బంతి అందకుండా తప్పించుకున్నాడు. అలా కొద్దిగా ముందుకు వచ్చేశాడు. కానీ కొంతసేపటికి బంతి అబ్రార్ ప్యాడ్‌లో నుంచి కిందపడిపోయింది. దాన్ని గమనించిన అబ్రార్ వెంటనే క్రీజులోకి పరుగులు తీశాడు. ఈ మొత్తం సంఘటన చాలా సరదాగా సాగింది. ఇద్దరు ప్లేయర్స్ కొట్టుకుంటున్నట్టు కాకుండా చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు ప్రవర్తించారు. దీంతో మైదానంలోని ప్లేయర్స్, స్టేడియంలోని ఆటగాళ్ళతో సహా ఆ మ్యాచ్ చూస్తున్నవాళ్లందరూ పగలబడి నవ్వుకున్నారు.

అబ్రార్ చేసిన పని సోషల్ మీడియాలో వారికి కూడా తెగ నచ్చేసింది. రిపీటెడ్ గా చూసి మరీ నవ్వుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అబ్రార్ చేసిన పనికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇరు జట్ల ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ కూడా పగలపడి నవ్వుకున్నారు.


Updated : 19 July 2023 7:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top