Home > వైరల్ > బస్సు డ్రైవర్‌గా మారిన ఏసీపీ.. వీడియో వైరల్..

బస్సు డ్రైవర్‌గా మారిన ఏసీపీ.. వీడియో వైరల్..

బస్సు డ్రైవర్‌గా మారిన ఏసీపీ.. వీడియో వైరల్..
X

అతడొక పెద్ద పోలీసు అధికారి. కిందస్థాయి సిబ్బందిని ఆదేశించాలే కానీ ఎక్కడున్న వచ్చి చెప్పిన పని చేసి పెడతారు. కానీ ఆ అధికారి స్థాయిని పక్కనబెట్టి ఓ బస్సు డ్రైవర్ గా అవతారమెత్తాడు. అసలు ఓ ఏసీపీ..బస్సు ఎందుకు నడిపాడో అనే కదా మీ డౌట్..అయితే కింద ఓ లుక్కేయడండి.

బెంగ‌ళూరులో విప‌క్ష పార్టీల స‌మావేశం జ‌రిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి విప‌క్ష పార్టీల నేత‌లు భారీగా హాజ‌ర‌య్యారు. ప్రముఖ లరాకతో నగరంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా రూట్ 330 డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ బ‌స్సును రోడ్డుపైనే ప్ర‌యాణికుల‌తో స‌హా నిలిచిపోయింది.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ రామచంద్ర.. అనారోగ్యంతో ఉన్న ఆ డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రిక తరలించారు. అంతేగాక ప్రయాణికులతో నిలిచిపోయిన బస్సును తానే స్వయంగా నడుపుకుంటూ తీసుకెళ్లారు. వేరే డ్రైవర్ వచ్చే వరకు వేచి ఉంటే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆలోచించి తానే నడిపారు. ఒక కిలోమీటరుకు పైగా నడుపుతూ కార్పొరేష‌న్ పార్కింగ్ ప్ర‌దేశంలో బ‌స్సును పార్క్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏసీపీ స్పందించిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.

Updated : 21 July 2023 4:00 PM IST
Tags:    
Next Story
Share it
Top