Actress Hariteja: నటి హరితేజ విడాకులు!.. వైరల్గా మారిన ఇన్స్టా పోస్ట్
X
అటు బుల్లితెర, ఇటు వెండితెరపై తనదైన ముద్ర వేసిన నటి, యాంకర్.. హరితేజ. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. తన పంచ్ డైలాగ్స్, సటైరికల్ కామెంట్స్ తో జూనియర్ సూర్యకాంతంలా పేరు సంపాదించుకుంది. ఈ మాటలు అన్న ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమే. అందుకే ఆయన తీసిన ‘అఆ’ సినిమాలో చాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా నలిచింది. 2015లో దీపక్ అనే కన్నడ వ్యక్తిని పెళ్లి చేసుకుంది హరితేజ. వీరికి 2021లో కూతురు పుట్టింది. దాంతో హరితేజ కొంత బరువు పెరిగినా.. తర్వాత కష్టపడి స్లిమ్ అయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజను ఓ వార్త ఇబ్బంది పెట్టింది.
ఇన్ స్టాగ్రామ్ లో హరితేజ చేసిన తాజా చిట్ చాట్ సెషన్ లో ఓ నెటిజన్ ‘మీరు విడాకులు తీసుకున్నారా’అని అడిగాడు. దీనికి అవాక్కైన హరితేజ.. తనదైన స్టైల్లో జవాబిచ్చింది. ‘నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే.. మనిషిని కూడా చంపేసేలా ఉన్నారు. ఇలా ఉన్నరేంటి’ అంటూ తన భర్తతో కలిసున్న ఫొటోను షేర్ చేసి రిప్లై ఇచ్చింది. తన భర్తతో హ్యాపీగా ఉన్నానని, విడాకుల లాంటిదేం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.