Home > వైరల్ > 'కుక్కలు కూడా ఇలాంటి పనిచేయవు'.. కస్తూరి షాకింగ్ కామెంట్స్

'కుక్కలు కూడా ఇలాంటి పనిచేయవు'.. కస్తూరి షాకింగ్ కామెంట్స్

శిక్షిస్తారా..? లేదంటే బీజేపీ మనిషని వదిలేస్తారా?

కుక్కలు కూడా ఇలాంటి పనిచేయవు.. కస్తూరి షాకింగ్ కామెంట్స్
X

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై నెటిజన్‌లంతా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒళ్లు కొవ్వెక్కి ఓ నీచుడు.. రోడ్డు పక్కన మెట్లపై కూర్చున్న ఓ యువకుడిపై మూత్ర విసర్జన చేయడాన్ని కామెంట్ల రూపంలో ఖండిస్తున్నారు. ఓ అమాయక గిరిజనుడిపై.. మనిషి రూపంలో ఉన్న ఓ పశువు చేసిన వికృత పనిపై మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి పేరు పర్వేష్ శుక్లా అని తెలిసింది. మద్యం మత్తులో ఊగుతూ, సిగరెట్ కాల్చుతూ.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఆ ఛండాలుడు. ఓ షాపు మెట్లపై గిరిజనుడు కూర్చోని ఉండగా.. అతడి ముఖంపై మూత్రం పోశాడు. ఈ తతంగాన్ని మరో వ్యక్తి సిగ్గులేకుండా వీడియో తీశాడు. ఈ దారుణం మూడు నెలల క్రితమే జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్గా మారింది.





అయితే ఇదే వీడియోను షేర్ చేసిన నటి కస్తూరి.. కుక్కలు కూడా ఈ పనిచేయవంటూ విరుచుకుపడింది. ఈ నిందితుడికి శిక్ష వేస్తారా? లేదా? అని ప్రశ్నిస్తూ పోస్ట్ చేసింది. వీడియో షేర్ చేసిన కస్తూరి.. తన ట్వీట్‌లో ‘కుక్కలు కూడా ఇలా చేయవు. ఈ ప్రవేశ్ శుక్లా బీజేపీ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లాకు సన్నిహితుడని తెలుస్తోంది. అతన్ని తక్షణమే నిర్ణయాత్మకంగా శిక్షిస్తారా లేదా విషయాన్ని వదిలేస్తారా? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన, TNBJP లీడర్ చేసిన మరొక ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నాను’ అని పేర్కొంది. అయితే కస్తూరి ఈ పోస్టు చేసిన కొద్ది సమయంలోనే ఎంపీ పోలీసులు పర్వేజ్ శుక్లాను అరెస్ట్ చేసినట్లు అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేయగా.. కస్తూరి ఆ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ నోట్ షేర్ చేసింది.

మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు.మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు అంతం కావాలన్నారు.




Updated : 5 July 2023 8:52 AM IST
Tags:    
Next Story
Share it
Top