కొత్త ప్రేమలో సమంత.. ఇన్స్టా పోస్ట్ వైరల్
X
సమంత.. చైతూతో విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. విడాకుల తర్వాత ఈ అమ్మడు వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఖుషి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్లోనూ నటించింది. సామ్ మయోసైటిస్ జబ్బుతో బాధపడుతోంది. దీనికి చికిత్స తీసుకునేందుకు తన తల్లితో కలిసి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
అటు సోషల్ మీడియాలోనూ సామ్ యాక్టివ్గా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్.. నెట్టింట వైరల్గా మారింది. కొత్త ప్రేమ అనే పదంతో ఆమె ఓ పోస్ట్ చేసింది. ‘‘మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నా. కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి’’ అంటూ మూడు లవ్ ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఆమె ఓ గ్లాసును పట్టుకోగా.. ఆమె చేతికి లవ్ అనే అక్షరాలతో ఉన్న బ్రాస్‌లైట్ ఉంది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సామ్ మళ్లీ ప్రేమలో పడిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏం మాయ చేశావే మూవీతో కలిసిన సమంత - నాగచైతన్య ఆ తర్వాత ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో నాలుగేళ్లకే విడిపోయారు. వీరు విడిపోయిన వీళ్ల మీద వార్తలు మాత్రం ఆగడం లేదు. అప్పటినుంచి ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.