Home > వైరల్ > సినిమాలకు గ్యాప్ ఇచ్చి సమంత ఏం చేస్తోందో తెలుసా?

సినిమాలకు గ్యాప్ ఇచ్చి సమంత ఏం చేస్తోందో తెలుసా?

సినిమాలకు గ్యాప్ ఇచ్చి సమంత ఏం చేస్తోందో తెలుసా?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు ఎలాంటి సినిమాలు చేసేది లేదని నిర్ణయించుకుంది. ఈ మధ్యనే ఖుషి, సిటాడెల్ షూటింగ్‎లను పూర్తి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో తన ఫ్రెండ్స్‎తో కలిసి వెకేషన్‎ను ఎంజాయ్ చేస్తోంది.

హాలిడేకి సంబంధించిన పిక్స్, వీడియోలను తన ఇన్‏స్టాలోషేర్ చేస్తూ.. ఫాలోవర్లకు అప్డేట్ అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్ షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎప్పుడు జిమ్‏లో అత్యంత కష్టమైన వర్కవుట్స్ చేస్తూ కనిపించే సమంత ఈసారి బ్యాలెన్స్ టెస్టింగ్ అంటూ షాకింగ్ స్టంట్స్ చేసిన వీడియోనే షేర్ చేసింది. అత్యంత సాహోసపేతమైన ఈ స్టంట్స్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ మనం ఇలా పార్టీ చేసుకుందాం అంటూ క్యాప్షన్‎ను జోడించింది సామ్.

గత కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. అప్పట్లో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంది. కాస్త కోలుకున్న సమంత శాకుంతలం, యశోద వంటి చిత్రాలలో నటించింది. ఇవి చెప్పుకోదగ్గ హిట్ సాధించలేకపోయాయి. అయినప్పటిక సామ్ అనంతరం విజయ్ దేవరకొండతో ఖుషి, వరుణ్ దావణ్‎తో కలిసి సిటాడెల్ సినిమాల్లో నటిచింది. ఈ చిత్రాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం మరోసారి సమంతను మయోసైటిస్ సమస్య వేధించడం మొదలుపెట్టింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాల్లో చికిత్స తీసుకోవాలని డిసైడ్ అయ్యింది సామ్. అంతే కాదు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం తీసుకున్న డబ్బును రిటర్న్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీలో అత్యంత క్లిష్టతరమైన స్టంట్స్ చేస్తూ తన బాలెన్స్ లెవెల్స్‎ను తెలుసుకుంటున్న సామ్ త్వరలోనే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనుందట. సామ్ త్వరగా తన చికిత్సను పూర్తి చేసుకుని మళ్లీ ఫామ్‎లోకి రావాలని ఆమె అభిమానులు ఆమెకు అల్ ది బెస్ట్ చెబుతున్నారు.












#SamanthaRuthPrabhu shows off how she parties and it's unlike anything you imagined 🙌🔥#Samantha #pinkvilla pic.twitter.com/5pEebwJhPv

Updated : 26 July 2023 11:37 AM IST
Tags:    
Next Story
Share it
Top