Home > వైరల్ > రాహుల్ గాంధీకి షెర్లిన్ చోప్రా బంపర్ ఆఫర్..

రాహుల్ గాంధీకి షెర్లిన్ చోప్రా బంపర్ ఆఫర్..

రాహుల్ గాంధీకి షెర్లిన్ చోప్రా బంపర్ ఆఫర్..
X

ముదురు అందాల భామ షెర్లిన్ చోప్రా మళ్లీ వార్తలకెక్కింది. అందాల ఆరబోతతో, పనికిమాలిన మాటలతో మీడియా దృష్టిని తనవైపు తిప్పుకునే ఈ హైదరాబాదీ భామ మరింత మసాలా వార్త చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాహుల్ గాంధీని పెళ్లాడతానని అంది. కాకపోతే ఓ షరతు పెట్టింది!

40 ఏళ్ల షర్లిన్‌ను ఓ విలేకరి ఇంటర్వ్యూ చేస్తూ, ‘‘మీరు రాహుల్ గాంధీని పెళ్లాడతారా?’’ అని అడిగారు. దానికి ఆమె బదులిస్తూ, ‘‘తప్పకుండా. కాకపోతే ఆయన ఒక షరతుకు ఒప్పుకోవాలి. పెళ్లయిన తర్వాత కూడా నా ఇంటిపేరులో చోప్రా అని ఉండాలి. దీనికి అంగీకరిస్తే ఆయనను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు’’ అని అంది. దీంతో ఆమె మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘‘నిన్ను పెళ్లి చేసుకుంటే రాహుల్ బతుకు బజారుపాలై’’ అని కొందరు, ‘‘చూడముచ్చటగా ఉంటుంది, ఎంజాయ్’’ అని కొందరు అంటున్నారు. రాహుల్ గాంధీకి తర్వగా పెళ్లి చేద్దామని, మంచి పిల్లను చూడాలని సోనియా గాంధీ ఇటీవల హరియాణా మహిళలతో అనడం తెలిసిందే.

హైదరాబాద్‌లో జన్మించిన షెర్లిన్ 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కెరీర్ సోసోగానే సాగుతోంది. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ, సెమీ న్యూడ్ ఫొటో సెషన్లతో హల్‌చల్ చేస్తూ ఉంటుంది. క్రికెటర్ల భార్యలకు డ్రగ్స్ అలావాటు ఉందని, ఇండస్ట్రీలో ఎవరూ నీతివంతులు కాదని అప్పుడప్పుడూ బాంబులు వేస్తుంటుంది. ఓ నిర్మాత తనను అత్యాచారం చేసి, చంపుతానని బెదిరిస్తున్నాడంటూ ఇటీవల ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వీడియో చిత్రీకరణ విషయంలో గొడవ వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని, అయితే నిర్మాత తనకు ఫోన్ చేసి, యాక్ట్ చేస్తావా లేకపోతే చంపమంటావా అని బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయింది.

Updated : 6 Aug 2023 2:34 PM IST
Tags:    
Next Story
Share it
Top