Home > వైరల్ > చంద్రయాన్ 3తో ఆదిపురుష్ను పోలుస్తూ..నెటిజన్ల రచ్చ

చంద్రయాన్ 3తో ఆదిపురుష్ను పోలుస్తూ..నెటిజన్ల రచ్చ

చంద్రయాన్ 3తో ఆదిపురుష్ను పోలుస్తూ..నెటిజన్ల రచ్చ
X

చంద్రయాన్‌-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తొలిఘట్టం సక్సెస్ కావడంతో ఇస్రోను అంతా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు చంద్రయాన్ 3తో ఆదిపురుష్ను పోలుస్తూ నెట్టింట మరోసారి విమర్శలకు తెరదీశారు. ఆదిపురుష్ బడ్జెట్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువ అంటూ కొత్త చర్చకు తెరదీశారు.

ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. టీజర్తో మొదలైన నెగిటివిటీ విడుదల తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. రామాయణాన్ని వక్రీకరించి సినిమా తీశారని ఆరోపణలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. హిందూ సంఘాలు పలుచోట్ల షోలను కూడా అడ్డుకున్నారు.

చంద్రయాన్ 3తో ఈ సినిమా బడ్జెట్ను పోలుస్తూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 600కోట్లపైగా బడ్జెట్తో ఆదిపురుష్ను తెరకెక్కించారని సమాచారం. అయితే చంద్రయాన్ 3 కోసం ఇస్రో 615 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆదిపురుష్ కంటే చంద్రయాన్ 3కే తక్కువ బడ్జెట్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఆదిపురుష్ మూవీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కామెంట్లపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Updated : 15 July 2023 12:26 PM IST
Tags:    
Next Story
Share it
Top