Home > వైరల్ > ధోనికి తెలియకుండా సీక్రెట్ వీడియో.. ఎయిర్ హోస్టెస్‌పై ఫ్యాన్స్ ఫైర్

ధోనికి తెలియకుండా సీక్రెట్ వీడియో.. ఎయిర్ హోస్టెస్‌పై ఫ్యాన్స్ ఫైర్

ధోనికి తెలియకుండా సీక్రెట్ వీడియో.. ఎయిర్ హోస్టెస్‌పై ఫ్యాన్స్ ఫైర్
X

అభిమానం ఉండాలే కానీ.. అది హద్దులు దాటకూడదు. ప్రతీ ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుందన్న విషయాన్ని.. సెలబ్రిటీల అభిమానులు తప్పక గుర్తుంచుకోవాలి. ఇప్పుడీ విషయం చెప్పడానికి కారణం.. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి ఓ విమానంలో జరిగిన సంఘటన. ధోని కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులే కాకుండా.. ఇతర జట్లలోని ఆటగాళ్లూ అతడిని ఆరాధిస్తారు. అతడు కనిపిస్తే చాలు.. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఈ క్రమంలో పలువురు హద్దులు దాటి కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీకి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇటీవల ఓ విమానంలో ధోనీ భార్య సాక్షితో కలిసి ప్రయాణించాడు. అయితే.. అతడు నిద్ర పోతున్న సమయంలో ఎయిర్‌ హోస్టెస్‌ ఒకరు.. ధోనీకి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ధోనీ ప్రశాంతంగా నిద్రపోతుండగా.. పక్కనే సాక్షి కనిపిస్తున్నారు. ‘ధోనీ ఇక్కడే ఉన్నారు.. చూడండంటూ’ ఈ వీడియో తీసిన ఎయిర్‌ హోస్టెస్‌ ముందు వైపున సిబ్బంది ఉండే క్యాబిన్ వద్ద నవ్వుతూ కనిపిస్తున్నారు. అయితే.. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

ఈ ఘటనపై నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు కొందరు సపోర్టు చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ధోనీ ప్రైవసీకి భంగం కలిగించడమేనని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అభిమాన క్రికెటర్‌‌తో ఫొటో దిగాలనే ప్రయత్నం మంచిదే కానీ, అవతలి వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని కామెంట్లు చేస్తున్నారు. ధోని నిద్రను డిస్టర్బ్ చేయకుండా వీడియో తీసింది.. కాబట్టి దీనిని నెగెటివ్ గా చూడకండి అంటూ ఇంకొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Cutest video on the Internet today 🤩💛#WhistlePodu #MSDhoni

Updated : 30 July 2023 3:39 PM IST
Tags:    
Next Story
Share it
Top