Home > వైరల్ > పులిని పరిగెత్తించి దాడి చేసిన కోతులు...వీడియో వైరల్

పులిని పరిగెత్తించి దాడి చేసిన కోతులు...వీడియో వైరల్

పులిని పరిగెత్తించి దాడి చేసిన కోతులు...వీడియో వైరల్
X

ఐకమత్యమే మహా బలం అని చెప్పుకుంటాం. ఐకమత్యంగా ఉంటే ఎంతటి బలశాలినైన ఓడించవచ్చు...ఎలాంటి ఆపదనైనా జయించవచ్చు అనేదానికి ఈ సంఘటనే నిదర్శం. పులి గురించి చెప్పక్కర్లేదు. క్రూరమైన జంతువుల్లో చిరుత పులి అతి ముఖ్యమైనది. ఒక్క పంజాతోనే జంతువులను చంపేయగలదు. అడవి పంది, జింక, ఎలుకలు, ఎలుగుబంటి, పక్షుకు, ఖడ్గమృగం, మొసలి, గేదె వంటి జంతువులను వేటాడి సులభంగా తినేస్తోంది. అట్లాంటి చిరుతపులి..కోతులకు భయపడి ప్రాణ భయంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రకారం ఓ రోడ్డుపై కోతుల గుంపు ఉంది. సుమారు 50 కోతులు అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంతలో అక్కడికి ఓ చిరుత పులి వచ్చింది. కోతులే కదా ఏం చేస్తాయి అని అనుకున్నాదో ఏమో ఓ కోతిపై దాడి చేసింది. నోట కర్చుకొని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే బలవంతమైన చిరుతపై అన్ని కోతులు ఒక్కసారిగా దాడి చేసాయి. దానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీద పడి విచక్షణ రహితంగా దాడి చేస్తూ గాయపరిచాయి. దీంతు చిరుత పులి వాటిపై దాడి చేయడం ఆపేసి...తప్పించకోవడానికి ప్రయత్నించింది.

అతి కష్టం మీద వాటి నుంచి విడిపించుకొని పరుగులు తీసింది. అయితే వదలని కోతులు, వెంటాడి మరి దాడి చేశాయి. ఈ ఘటన రహదారిపై జరగడంతో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. పులి-కోతి ఫైట్‌ను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో ఆప్లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాని ఓ మారుమూల ప్రాంతంలో జరిగింది.

Updated : 16 Aug 2023 11:54 AM IST
Tags:    
Next Story
Share it
Top