Home > వైరల్ > టీ అమ్మే యువకుడి కిడ్నాప్.. తర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్..

టీ అమ్మే యువకుడి కిడ్నాప్.. తర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్..

టీ అమ్మే యువకుడి కిడ్నాప్.. తర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్..
X

రోడ్లమీద టీ అమ్ముకుని పొట్టపోసుకునే ఓ యువకుడి జీవితాన్ని అతని స్నేహితులే సర్వనాశనం చేశారు. ఒక్కసారిగా మీద పడి కిడ్నాప్ చేసి ఊరిబయటికి తీసుకెళ్లి ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 లక్షలును అతని బ్యాంకు అకౌంటు నుంచి తమ అకౌంట్లలోకి బదిలీ చేయించుకుని కొట్టి పంపారు. టీ అమ్ముకునే వ్యక్తి దగ్గర అన్ని లక్షల డబ్బు ఎలా ఉందని అనుమానపడుతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. బెంగుళూరు త్యాగరాజనగర్‌కు చెందిన తిలక్ మణికంఠ అనే 32 ఏళ్ల వ్యక్తి టీ రోడ్లమీద అమ్ముకుని జీవిస్తున్నాడు. ఇంటి దగ్గర చిన్నపాటి నాన్ వెజ్ వంటలు కూడా అమ్ముతుంటాడు.

మణికంఠ ఈ నెల 1న గోవాకు స్నేహితులతో వెళ్లి క్యాసినోలో రూ. 25 లక్షలు గెలుపొందాడు. ఆ సంగతి స్నేహితులకు చెప్పకపోయినా అతని ముఖం చూసి కనిపెట్టారు. తర్వాత అందరూ బెంగళూరుకు తిరిగి వచ్చారు. మణికంఠ జాక్ పాట్ కొట్టి సంగతి తెలుసుకున్న స్నేహితులు పండు, కార్తీక్, ఈశ్వర్, నిశ్చల్‌లు సొమ్ము కాజేయడానికి ప్లాన్ వేశారు. ఈ నెల 5వ తేదీన అతణ్ని ఓ బేకరీలో టీ తాగుతుండగా బయటికి పిలిచి కిడ్నాప్ చేశారు. కారులో జ్ఞానభారతి ప్రాంతానికి తీసుకెళ్లి కొబ్బరి చెట్టుకు కట్టేసి ఫోన్ లాక్కున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా 25 లక్షలు బ్యాలెన్స్ కనిపించింది. పిన్, బ్యాంక్ ఖాతా క్రెడెన్షియల్స్ అన్నీ చెప్పించకుని రూ.15 లక్షలను వారి అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని వదిలేశారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాక్ పాట్ కొట్టిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పనేలేదని, అయినా వారు కనిపెట్టి దోచుకున్నారని మణికంఠ వాపోతున్నాడు.


Updated : 11 Aug 2023 8:45 PM IST
Tags:    
Next Story
Share it
Top