కిషన్ రెడ్డికి ఏం అర్హత ఉంది.. నాకెందుకు లేదు..బీజేపీ ఎమ్మెల్యే ఆడియో వైరల్
X
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జేపీ నడ్డాలపై సోమవారం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను రఘునందన్ రావు ఖండించారు. తన మాటలను వక్రీకరించారని అన్నారు. ఈ క్రమంలో ఆయన ఆడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
‘‘దుబ్బాకకు అమిత్ షా రాలేదు. నేనొక్కడినే పోరాటం చేసినా. ఒక్కరైనా సాయం చేశారా? ఒక్క రూపాయి ఇచ్చారా? వంద కోట్లు తర్వాత.. కనీసం రూపాయి బిళ్ల ఇచ్చారా?. నాకు వంద కోట్లు ఇస్తే తెలంగాణను ఉరికించి ఆడిస్తా. బీజేపీలో కింద ఉన్న వాళ్లని పైకి తీసుకురాకపోతే వాళ్ల ఖర్మ. నేను ఆటంబాంబు లాంటోడిని అంటూ ఆ ఆడియోలో ఉంది.
దుబ్బాకలో నేను పోటీ చేయకముందు పార్టీకి 3500 ఓట్లే వచ్చాయి. పార్టీ, గుర్తు అనేవి లాస్ట్ అంశం. అదే పువ్వు గుర్తు వంద కోట్లు ఇస్తే మునుగోడులో ఎందుకు గెలవలేదు? నేను గెలిపిస్తా నువ్వు రిజైన్ చెయ్యి అని అమిత్ షా అన్నాడు. మరి మునుగోడులో అమిత్ షా చాణక్యం ఏమైంది’’ అని రఘునందన్ రావు అన్నట్లు ఆడియోలో ఉంది.