Home > వైరల్ > కెమెరా ముందు ఆ పనేంటి? సల్మాన్ ఖాన్‎పై నెటిజన్స్ ఫైర్

కెమెరా ముందు ఆ పనేంటి? సల్మాన్ ఖాన్‎పై నెటిజన్స్ ఫైర్

కెమెరా ముందు ఆ పనేంటి? సల్మాన్ ఖాన్‎పై నెటిజన్స్ ఫైర్
X

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మొన్నామధ్య సల్మాన్ బాడీగార్డ్స్ దురుసుగా ప్రవర్తించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా సల్మాన్ ఖాన్ ఏకంగా లైవ్ షోలో సిగరెట్ తాగిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనంగా మారింది. స్టార్ హీరో అయ్యుండి కెమెరా ముందు ఇలాంటి పనులు చేయడం ఏమిటని నెటిజన్స్ సల్మాన్‎పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

వరుస ప్రాజెక్టులతో బాలీవుడ్‎లో దూసుకెళ్తున్నాడు సల్మాన్ ఖాన్. కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా ఫ్లాప్ తరువాత, త్వరలో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరోవైపు బుల్లితెరపైన టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్‎షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు సల్మాన్. రీసెంట్‎గా టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ పట్టుకుని కనిపించాడు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. సాధార‌ణంగా హోస్ట్ కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రవ‌ర్తించార‌నే దానిపై విశ్లేషిస్తారు. అయితే అలా చేస్తున్న సమయంలో ఓ సంద‌ర్భంలో స‌ల్మాన్ ఖాన్ చేతిలో సిగ‌రెట్ క‌నిపించింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో దుమారం రేపుతోంది. దీంతో అది చూసిన నెటిజ‌న్స్‌.. మీరు ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్..అలాంటిది కెమెరా ముందు ఇలా ప్రవర్తించకూడదని తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా స్మోకింగ్ మంచి చర్య కాదని మీరు ఇతరులకు చెప్పాల్సింది పోయి ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి నెటిజన్స్ ఆగ్రహాన్ని సల్మాన్ ఎలా కూల్ చేస్తారో వేచి చూడాల్సిందే.


Updated : 10 July 2023 11:04 AM IST
Tags:    
Next Story
Share it
Top