Home > వైరల్ > చంద్రయానా, లూనానా...ముందు ఏది దిగుతుంది...?

చంద్రయానా, లూనానా...ముందు ఏది దిగుతుంది...?

చంద్రయానా, లూనానా...ముందు ఏది దిగుతుంది...?
X

ఈరోజే చంద్రయాన్-3 నుంచి విక్రమ్ ల్యాండర్ విడివడింది. మరో ఆరు రోజుల్లో చంద్రుని మీద అడుగు పెట్టనుంది. మరో వైపు ఇదే టైమ్ లో రష్యా ప్రయోగించిన లూనా కూడా ఇదే టైమ్ లో చంద్రుని మీద అడుగుపెట్టనుంది. దీంతో ఏది ముందు అడుగుపెడుతుంది, విజయం సాధిస్తుంది అంటూ ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రెండూ చాలా కొంచెం తేడాలో రెండూ చంద్రుని మీద అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి..కానీ అంతకంటే సురక్షితంగా దిగడమే ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

జూలై 14న చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చంద్రుని మీద అడుగుపెట్టడానికి దాదాపు 40 రోజులు టైమ్ పడుతుంది. ఆగస్టు 23న జాబిల్లి మీదకు చేరనుంది. మరోవైపు 50 ఏళ్ళ తరువాత రష్యా చంద్రుని దక్షిణ ద్రువం మీద పరిశోధనల కోసం ఆగస్టు 10న లూనా-25 ను ప్రయోగించింది. ఇది కేవలం 11 రోజుల్లోనే చంద్రుని మీద అడుగుపెట్టనుంది. కాబట్టి లెక్క ప్రకారం లూనా కూడా ఆగస్టు 21 నుంచి 23 లోపలే జాబిల్లి మీద అడుగుపెడుతుంది. మన దాని గురించి ఇస్రో చాలా స్పష్టంగా చెప్పేసింది. దిగే రోజు, టైమ్ తో సహా అన్నీ చెప్పేసింది. కానీ రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ మాత్రం దీని గురించి ఇంకా ఏం చెప్పలేదు. అయితే రెండూ ఒకే రోజు చంద్రుని మీద దిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు. కాకపోతే దిగే సమయాల్లోనే తేడా ఉండొచ్చని చెబుతున్నారు. దాన్ని ముందు ఏది ముందు, ఏది వెనుక అనేది స్పష్టమవుతుంది.

రెండు ప్రయోగాలకు తేడా ఏంటి?

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుని మీ అడుగు పెట్టడానికి 40 రోజులు పడితే...రష్యా ప్రయోగించిన లూనా మాత్రం 11 రోజుల్లోనే దిగుతోంది. ఎందుకింత తేడా అనేది చూస్తే....చంద్రయాన్ కన్నా లూనా తక్కువ బరువు కలిగి ఉంది. అంతేకాదు లూనాలో ఇంధన సామర్ధ్యం కూడా ఎక్కువ. లూనా వేగం కూడా చంద్రుని దగ్గరకు తొందరగా వెళ్ళడానికి దోహదపడుతోంది. లూనా బరువు 1750 కిలోలు కాగా, చంద్రయాన్ బరువు 3900 కిలోలు. మనదానిలో పేలోడ్ బరువు సుమారు 1800 కిలోలు అయితే లూనా పేలోడ్ కేవలం 31 కేజీలు మాత్రమే. అందుకే లూనా చాలా తక్కువ సమయంలోనే చంద్రుని మీదకు వెళ్ళగలుగుతోంది. మరోవైపు చంద్రయాన్ లో ఇంధన సామర్ధ్యం తక్కువగా ఉండటం వలన ఎక్కువసార్లు కక్ష్యలో తిరుగుతూ వెళ్ళాల్సి వచ్చిందని, అందుకే ఎక్కువ రోజులు పట్టిందని ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కే. శివన్ తెలిపారు.

ఇప్పుడు చంద్రయాన్-3, లూనా ల్యాండింగ్ ల గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రుని మీద సూర్యకాంతిని బట్టిని ల్యాండర్లు దిగనున్నాయి. మరోవైపు చంద్రయాన్-3 చంద్రుని మీద 14 రోజులు మాత్రమే ఉండి పని చేస్తోంది. కానీ రష్యా ప్రయోగించిన లూనా మాత్రం ఏడాది పాటూ పరిశోధనలు చేయనుంది.


Updated : 17 Aug 2023 8:02 PM IST
Tags:    
Next Story
Share it
Top