క్రిస్మస్ అని చికెన్ ఆర్డర్ పెట్టాడు.. బాక్స్ ఓపెన్ చేసి చూడగా షాక్
X
పండగలైనా.. మీటింగ్స్ అయినా.. బద్దకంగా ఉన్నా.. ఇంట్లో సరుకులు లేకపోయినా.. టక్కున మొబైల్ ఓపెన్ చేసి, ఫుడ్ డెలివరీ చేయడం బాగా అలవాటు అయిపోయింది అందరికి. హోటల్ ఏదైనా.. క్వాలిటీ ఎట్లున్నా పరవాలేదు. కడుపు నిండితే చాలన్నట్లు వ్వహరిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్న హోటల్స్ నిర్వాహకులు కొందరు హోటల్ నిర్వాహకులు.. కల్తీ, నాణ్యతలేని ఫుడ్ ను డెలివరీ చేస్తున్నారు. దానివల్ల ఫుడ్ పార్సిల్స్ లో పురుగులు, బల్లులు, ఇతర వస్తువులు వస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ మాదిరిగానే ఈసారి మరో కొత్త ఐటమ్ ఫుడ్ పార్సిల్ లో ప్రత్యక్షం అయింది.
ముంబైకి చెందిన ఉజ్వల్ పూరి అనే యువకుడు.. స్విగ్గీలో లియోపోల్డ్ కేఫ్ నుంచి చికెన్ ఐటెమ్ ఆర్డర్ చేశాడు. ఆకలితో ఉన్నాడో ఏమో.. ఆర్డర్ రాగానే సగం లాగించేశాడు. అంతలోనే తేరుకుని షాక్ అయ్యాడు. సగం వరకు తినగా అందులో ట్యాబ్లెట్ (మెడిసిన్) ప్రత్యక్షమయింది. అందులో ఒకటి పూర్తిగా చికెన్ లో ఉడికిపోయినట్లు తెలుస్తుంది. అది గమనించిన పూరి.. స్విగ్గీ యాప్ లో కంప్లైంట్ చేశాడు. తక్షణమే స్పందించిన స్విగ్గీ.. నేరుగా అతనితో కాంటాక్ట్ అయింది. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరింది. దాన్ని అప్పటికే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్త వైరల్ అయింది. దానిపై స్పందించిన కొందరకు నెటిజన్స్.. లియోపోల్డ్ కేఫ్ సర్వీస్, నాణ్యత తగ్గిందని చెప్పారు. వంటలు సరిగా, పరిశుభ్రంగా చేయాలని కనీసం స్విగ్గీనైనా సదరు రెస్టారెంట్‌ను అడగాలని మరో యూజర్ సూచించాడు.
My Mumbai Christmas Surprise ordered food from Swiggy from Leopold Colaba got this half cooked medicine in my food @Swiggy pic.twitter.com/ZKU30LzDhi
— Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) December 24, 2023