Home > వైరల్ > సీఐ స్వర్ణలతకు ఆ కళ కూడా ఉంది.. ఆ పిచ్చితోనే ..

సీఐ స్వర్ణలతకు ఆ కళ కూడా ఉంది.. ఆ పిచ్చితోనే ..

సీఐ స్వర్ణలతకు ఆ కళ కూడా ఉంది.. ఆ పిచ్చితోనే ..
X

ఒంటిపై ఖాకీ యూనిఫామ్.. ఖాకీల సంఘానికి ఉపాధ్యక్షురాలి హోదా.. ఆ హోదాతో బడా నేతల పరిచయం.. వెరసి తన అధికారంతో అక్రమాలకు పాల్పడిన సీఐ స్వర్ణలత వ్యవహారం పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది. రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ఈ ముఠా నాయకురాలు సీఐ స్వర్ణలత అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

నోట్ల మార్పిడి డ్రామా ఆడి బెదిరించి డబ్బులు తీసుకున్న సీఐ స్వర్ణలత ఎపిసోడ్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదట. ఈ క్రమంలోనే ఓ ప్రజాప్రతినిధి తాను తీసే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని.. డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పడంతో ఆమె తెగ ప్రాక్టీస్ చేస్తన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.





చిరంజీవి నటించిన ఓ సినిమాలోని పాటకు డ్యాన్స్‌ చేసి చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశారు. ‘‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్‌’’ అనే మూవీలో ఆమె ఓ లీడ్ రోల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కూడా ఆమెది పోలీసాఫీసర్ పాత్రే కావడం విశేషం. ఈ మూవీ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీలో నిర్మాణంలో ఆమె కూడా భాగస్వాములు అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్వర్ణలత లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తుండడంతో అంతా అవాక్కవుతున్నారు.

స్వర్ణలత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆమెను ఈ కేసు నుంచి ఆమెను తప్పించేందుకు కొందరు బడా వ్యక్తులు తీవ్రంగా కృషి చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వర్ణలతపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. యూనిఫామ్‌లో వెళ్లి సివిల్‌ కేసుల సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. వ్యవహారం స్టేషన్‌ దాకా రాకుండానే అనేక కేసులు క్లోజ్‌ చేసినట్లు విమర్శలు ఉన్నాయి.

Updated : 8 July 2023 12:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top