Chandrababu arrest: ‘కొట్టాడు తీసుకున్నాం.. మా టైం వస్తుంది’: జగన్ వీడియో వైరల్
X
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను.. నంద్యాలలోని ఆర్.ఫంక్షన్ హాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి విజయవాడకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో బంద్ పాటిస్తున్నారు. ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ.. టీడీపీ నేతలు ఐసీపీపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు.. తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ చేశారని సమర్థించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఇరు పక్షాల నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటుంటే.. సీఎం జగన్ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2017లో సీఎంగా ఉన్న చంద్రబాబును ఉద్దేశిస్తూ.. జగన్ మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియోను వైసీపీ నేతలు ట్వీట్ చేస్తూ.. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని కామెంట్ చేస్తున్నారు. వీడియోలో ‘గుండె ధైర్యం ఉంది. ఆయన కొట్టాడు. మా టైం వస్తుంది. మేమూ కొడతాం’అని జగన్ మాట్లాడుతుంటారు. చంద్రబాబు నంద్యాలనే వైసీపీని ఓడించాడు. అదే గడ్డపై చంద్రబాబును అరెస్ట్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో జగన్ ను అరెస్ట్ చేసిన సంద్భాలూ ఉన్నాయి. వాటన్నింటికి ప్రతీకారంగా జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశాడని అంటున్నారు.
Chandrababu arrest: ‘కొట్టాడు తీసుకున్నాం.. మా టైం వస్తుంది’: జగన్ వీడియో వైరల్https://t.co/izKYWojjIt pic.twitter.com/UhC8y4l6gZ
— Mic Tv (@Mictvdigital) September 9, 2023