రాహుల్‌కు పెళ్లి చేద్దామా?.. సోనియా గాంధీ రిప్లై ఏమిటంటే?
X
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కుటుంబం ఈ మధ్యనే హరియాణా మహిళా రైతులతో సంతోషంగా గడిపింది. దేశ రాజధాని ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం వీరి రాకతో కళకళలాడింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా అందరూ గ్రామీణ మహిళలతో ఎంతో ఆప్యాయంగా , ప్రేమగా ముచ్చటించారు. మహిళలతో కలిసి భోజనం చేశారు. వారితో ఆడిపాడారు. వారి కష్టసుఖాలను అడిగిమరీ తెలుసుకున్నారు. మహిళలు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించి వారిని సంతోష పెట్టారు. రీసెంట్గా రాహుల్ హరియాణా పర్యటనలో మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ‘ఢిల్లీ దర్శన్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో, వారంతా హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ హరియాణా మహిళా రైతులు సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ రాహుల్ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ కి పెళ్లి చేద్దామా? అని ఓ హరియాణా మహిళ సోనియాను అడిగారు. అందుకు సోనియా బదులిస్తూ..మీరే ఓ మంచి పిల్లను చూడండి చేసేద్దాం అని అనడంతో రాహుల్ నవ్వుతూ అవుతుంది..అవుతుంది ని చెప్పుకొచ్చారు.