‘గో’రం.. ఇలాంటి ఆవు దాడిని మీరెప్పుడు చూసి ఉండరు.. వీడియో
X
చెన్నైలో ఘోరం జరిగింది. చిన్నారిపై ఆవు భీకర దాడి చేసింది. నిమిషం పాటు కొమ్ములతో పొడుస్తూ..కాళ్లతో తొక్కుతూ భయంకరంగా దాడి చేసింది. స్థానికులు ఆవును తరిమి చిన్నారిని కాపాడారు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నైలోని ఎంఎండీఏ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి కాలనీలో నడుచుకుంటూ వెళ్తోంది. అదే దారిలో ఓ ఆవు తన పిల్లతో కలిసి వెళ్తుంది అయితే అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి 9ఏళ్ల బాలికపై దాడి చేసింది. కొమ్ములతో పొడుస్తూ.. కాళ్లతో తన్నుతూ భయంకరంగా దాడి చేసింది. స్థానికులు కొడుతున్నా.. బాలకిపై దాడి మాత్రం ఆపలేదు. సుమారు నిమిషం పాటు ఈ దాడి కొనసాగింది. చివరకు స్థానికులు కట్టెలతో కొట్టి ఆవును తరిమి చిన్నారిని కాపాడారు.
ఈ ఘటలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ దాడిని చూసిన స్థానికులు భయాందోళన చెందారు. ఆవు ఇంత భయంకరంగా దాడిచేయడం చూసి షాక్ అయ్యారు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల ఆవుల యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ దాడి జరగడం దురదృష్టకరమన్న అధికారులు.. రోడ్లపై ఉన్న ఆవులను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
@chennaicorp
— இ செந்தில்குமரன் (@senthilkumarane) August 10, 2023
சென்னை அரும்பாக்கம் MMDA காலனி R பிளாக் இளங்கோ தெருவில் நடந்த சோக சம்பவம் பள்ளி குழந்தையை பந்தாடிய மாடு. தயவுசெய்து மாநகராட்சி நடவடிக்கை எடுக்க வேண்டும். pic.twitter.com/QypDrAZshF