ఆ సినిమాలో ఉన్న ఒకే ఒక్క కమెడియన్ నేనే.. ప్రభాస్ కామెంట్లు వైరల్
X
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్లో దూసుకెళ్తున్నాడు . వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓం రౌత్ ఆదిపురుష్ డిజాస్టర్ నుంచి కోలుకున్న డార్లింగ్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే పైనే దృష్టి సారించాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాదు రీసెంట్ గా విడుదలైన ప్రాజెక్ట్ కే మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ అందరిని ఇంప్రెస్ చేశాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగి ప్రాజెక్ట్ కే ఈవెంట్లో ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో నేను ఓ కమెడియన్ అంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచాయి. kalki 2898 AD లో ప్రభాస్ లుక్, పోస్టర్లను చూసిన వారెవరూ ప్రభాస్ కామెడీ చేస్తాడంటే నమ్మరు.కానీ ఇప్పుడు స్వయంగా డార్లింగే నేను ఓ కమెడియన్ అనడంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ మరింతగాపెరుగుతోంది.
ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.." ప్రాజెక్ట్ కే లో నేను ఓ సూపర్ హీరో. నా రోల్ మోత్తం చాలా ఫన్నీగా సాగుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నా పాత్రను డిజైన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో బలమైన ఎమోషన్స్ ఉంటాయి. చిత్రంలో ఉన్న ఒకే ఒక్క కమెడియన్ నేనే" అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరి ప్రభాస్ ఈ కామెంట్స్ సరదాగా చేశాడో, లేదా సీరియస్‌గా చెప్పాడో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ మూవీ టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేయడం పక్కా అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా కాన్సెప్ట్‌తో పాటు ప్రాజెక్ట్ కేలో కనిపించే పాత్రలు సైతం సరికొత్తగా ఉంటాయని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీకీ కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ తన పనితనాన్ని చూపించినట్లు ఇన్ఫర్మెషన్.