Home > వైరల్ > యువతి పోస్టుమార్టంకు సిద్ధమైన పోలీసులు.. కానీ అంతలోనే..

యువతి పోస్టుమార్టంకు సిద్ధమైన పోలీసులు.. కానీ అంతలోనే..

యువతి పోస్టుమార్టంకు సిద్ధమైన పోలీసులు.. కానీ అంతలోనే..
X

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ కుటుంబం అంతా అయిపోయిందుకున్న సమయంలో మ్యాజిక్ జరిగింది. ఇంట్లోని శోకసంద్రం కాస్త ఆనందంగా మారింది. ప్రస్తుతం ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.రాహ్‌ కలాం హవూదవా గ్రామంలోని చెరువులో రవీనా అనే యువతి దేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె కుటుంబసభ్యులకు విషయం తెలిపారు. ఆ యువతి మృతిచెందిందని భావించిన పోలీసులు పోస్టుమార్టంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తల్లిదండ్రులు ఆమెను వైద్యులకు దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు పటెహరా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు యువతిని పరిశీలించి, గుండె కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. వెంటనే చికిత్స చేయడం ప్రారంభించడంతో యువతి కోలుకుంది. తమ కూతురు బతికేవుందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ కూతురు మానసిక స్థితి సరిగ్గా లేదని.. ఇంట్లో చెప్పకుండానే వెళ్లిపోయిందని తెలిపారు. ఏదిఏమైన తమ కూతురు బతకడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.


Updated : 20 Jun 2023 11:11 AM IST
Tags:    
Next Story
Share it
Top