Home > వైరల్ > బతికుండగానే చంపేసి ఆస్తి ఆమ్మేశారు..

బతికుండగానే చంపేసి ఆస్తి ఆమ్మేశారు..

బతికుండగానే చంపేసి ఆస్తి ఆమ్మేశారు..
X

చనిపోయిన వ్యక్తులను చంపించడంతో పాటు..ఆరోగ్యంగా భూమి మీద ఉన్న వారిని చనిపోయినట్టు సృష్టించడం అధికారులకు మాత్రమే సాధ్యం. వారు తలచుకుంటే ఏమైనా చేయొచ్చు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. ఓ మహిళను రికార్డుల్లో చంపేశారు. దీంతో నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌‌తో కొందరు అక్రమార్కులు ఆమె ఆస్తిని అమ్మేశారు.

తమిళనాడులోని ఆంబూర్‌కు చెందిన కాంచన వర్మ అనే మహిళ బుధవారం కుప్పంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. రవికుమార్‌ అనే వ్యక్తి తాను మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించి తన ఆస్తిని ఇతరులకు విక్రయించారని నిరసన చేపట్టింది. తన భర్త రెండేళ్ల క్రితమే మరణించగా, తాను కూడా చనిపోయినట్లు కాంచన రవివర్మ పేరుతో డెత్ సరిఫికేట్ సృష్టించి ఆస్తిని ఆమ్మేశారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులను కోరింది. 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట సుబ్బయ్య హామీ ఇవ్వడంతో బాధితురాలు అక్కడి నుంచి వెనుదిరిగింది.


Updated : 19 July 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top