మెట్రోలో ముద్దులతో రచ్చ చేసిన మరో జంట
X
మిగతా మెట్రోలతో పోలిస్తే.. ఢిల్లీ మెట్రో కాస్త భిన్నం. ఈ దేశంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగినంతగా మరే మెట్రో ట్రైన్ పేరు వినిపించలేదు. అందుకు కారణం.. ప్రేమికుల శృంగార చేష్టలు. ఢిల్లీ మెట్రో పేరు వినిపిస్తే చాలు.. మళ్లీ ఏం జంట ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో.. లేదంటే పబ్లిక్ ఏ సిటిజన్ ఏ వెధవ పని చేశాడో అనే ఆలోచనే ముందుగా వస్తుంటుంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా రైలులో మళ్లీ ఓ అశ్లీల ఘటన వెలుగు చూసింది. పబ్లిక్ ప్లేస్ అనే సోయి కూడా లేకుండా తెగబడ్డారు ప్రేమికులు. అందరు చూస్తుండగానే.. రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..
ప్రయాణికులంతా మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ ప్రేమ జంటలు సీట్లో కూర్చొని రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. చుట్టూ జనాలు ఉన్నా అవేవీ లెక్క చేయలేదు. తమను అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా ముద్దులు పెట్టుకున్నారు. అశ్లీలంగా ప్రవర్తించారు. అయితే, వీరి ‘ఏ’ సీన్ దృశ్యాలను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు పలు రకాల ట్రోల్ చేస్తున్నారు.
దీంతో ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించి.. “హాయ్ మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. హుడా సిటీ సెంటర్లో తనిఖీ చేశాం. అలాంటి ప్రయాణీకులు కనిపించలేదు” అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను కూడా నెటిజన్లు మరో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ప్రయాణికులు ఇంకా అక్కడే ఉంటారా? ఆఫీసర్లకు ఆ మాత్రం అర్థం కాదా? అంటూ మండిపడుతున్నారు.