Home > వైరల్ > అది బైక్ షోరూమా? ఇల్లా...ధోనీ ఫామ్ హౌజ్ చూసి ఆశ్చర్యపోయిన వెంకటేశ్ ప్రసాద్

అది బైక్ షోరూమా? ఇల్లా...ధోనీ ఫామ్ హౌజ్ చూసి ఆశ్చర్యపోయిన వెంకటేశ్ ప్రసాద్

అది బైక్ షోరూమా? ఇల్లా...ధోనీ ఫామ్ హౌజ్ చూసి ఆశ్చర్యపోయిన వెంకటేశ్ ప్రసాద్
X

ధోనీకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో బైక్ లు అన్నా అంతే పిచ్చి....ఈ విషయం తెలియని భారతీయుడు ఉండడు. దాదాపుగా ప్రపంచంలో ఉన్న బైక్ లన్నీ అతని దగ్గర ఉన్నాయి. మొత్తం కలెక్షన్ ఆఫ్ బైక్స్ తో ధోనికి రాంచీలో ఓ ఫామ్ హౌసే ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో వంద కంటే ఎక్కువ బైక్ లు కనిపిస్తున్నాయి.

ధోనీకి చిన్నప్పటి నుంచి బైక్ లంటే పిచ్చి. బాగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వరుసగా బైక్ లను కొనిపెట్టుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఊరకనే పెట్టుకోవడమే కాదు....టైమ్ దొరికినప్పుడల్లా వాటి మీద షికార్లు కూడా చేస్తుంటాడు. అంతేకాదు వాటికి ఏమైనా రిపేర్లు వచ్చినా తనే స్వయంగా చేసుకుంటాడు కూడా. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు చక్కర్లు కూడా కొట్టాయి. గతంలో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లకు బైక్ లను ఇచ్చేవారు. ఆ బైక్ లను ధోనీనే ఫస్ట్ నడిపేవాడు.

తాజాగా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ధోనీ ఫామ్ కు వెళ్ళాడు. అక్కడ ఉన్న బైక్ లు, ఖరీదైన కారల్ కలెక్షన్లను చూస్తూ తెగ ఆనందించాడు. ఈ సందర్భంలో ధోనీ వైఫ్ సాక్షి ఓ వీడియోను తీశారు. వెంకటేశ్ ప్రసాద్ ను క్వశ్చన్లు అడుగుతూ వీడియో తీశారు. అందులో బాగంగానే ధోనీ బైక్ ల పిచ్చి గురించి వెంకటేశ్ మాట్లాడాడాు. ఇంత అభిరుచి, పిచ్చి ఉన్న వ్యక్తిని మరొకరిని చూడలేదని చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మహీ గొప్ప అఛీవర్, అంతకు మించి మంచి మనిషి అంటూ పొగడ్తల్లో ముంచేశాడు. ధోనీ ఫామ్ హౌస్ కు రావడం తనకు ఇది నాలుగోసారి అని చెప్పిన వెంకటేశ్....వచ్చిన ప్రతీసారి అద్భుతంగానే ఉంటుందని చెప్పారు.

సాక్షి తీసిన ఈ వీడియో వెంకటేశ్ ప్రసాద్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. ధోనీ బైక్ కలెక్షన్స్ చూసి అందరూ వావ్ అంటున్నారు.


Updated : 18 July 2023 1:56 PM IST
Tags:    
Next Story
Share it
Top