Home > వైరల్ > ఫుల్లుగా తాగిండు.. రోడ్డు అనుకుని రైల్వే ట్రాక్పై కారు నడిపి...

ఫుల్లుగా తాగిండు.. రోడ్డు అనుకుని రైల్వే ట్రాక్పై కారు నడిపి...

ఫుల్లుగా తాగిండు.. రోడ్డు అనుకుని రైల్వే ట్రాక్పై కారు నడిపి...
X

మందు తాగి వాహనం నడపొద్దని పోలీసులు చెబుతున్నా మందుబాబులు మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. మందు తాగి వాహనం నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మందుబాబు ఫుల్లుగా మందు తాగి కారును రైల్వే ట్రాక్పై నడిపాడు. పైగా దానిని షార్ట్ కట్ రోడ్డు అనుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరులో జరిగింది.

కన్నూరుకు చెందిన జయప్రకాశన్‌ జులై 18 రాత్రి ఫుల్లుగా మందు కొట్టాడు. ఆ తర్వాత తన కారులో ఇంటికి బయలుదేరాడు. రైల్వే ట్రాక్‌కు దగ్గరకు వచ్చేటప్పటికీ ఎటుపోవాలో కన్ఫ్యూజ్ అయ్యాడు. రైల్వే ట్రాక్నే షార్ట్‌కట్ దారి అనుకుని.. రైల్వేట్రాక్‌ పైకి కారు పోనిచ్చాడు. మద్యం మత్తులో కారును అలాగే కొన్ని మీటర్ల దూరం ట్రాక్‌పై నడిపాడు. ఆ తర్వాత కారు పట్టాలపై ఇరుక్కుపోయింది.

ఈ విషయాన్ని గమనించిన రైల్వే గేట్ కీపర్ సమీపంలోని రైల్వే స్టేషన్తో సహా పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. పట్టాలపై కారు ఉన్న సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Updated : 22 July 2023 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top