పీకలదాక తాగి కదిలే కారుపై పుషప్స్..దూలతీర్చిన పోలీసులు
X
సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతుండటంతో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నాడు. తమ ప్రతిభను చూపించుకునేందుకు కొంత మంది యువకులు రోడ్లపైన రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బైకులపైన, కార్లపైన రకరకాల విన్యాసాలను చేస్తూ హీరోల్లాగా ఫీల్ అవుతున్నారు. తాజాగా హర్యానాకు చెందిన కొంతమంది కుర్రాళ్లు కదులుతున్న కారుపైకి ఎక్కి వీరంగం చేశారు. మందు తాగుతూ కారుపైనే పుషప్స్ చేసి పబ్లిక్‌గా న్యూసెన్స్ చేశారు. ఈ దృష్యాలను వారి వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి యువకుల దూలతీర్చారు.
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలో కదులుతున్న కారుపై నలుగురు వ్యక్తులు మద్యం సేవించి, డ్యాన్స్ చేస్తూ, పుష్-అప్‌లు చేస్తూ కనిపించారు. ఏ మాత్రం భయం లేకుండా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కదులుతుందన్న విచక్షణను కోల్పోయి మరీ ప్రవర్తించడంతో హర్యానా పోలీసులు వీరి తాట తీశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపైన ఇలాంటి చేష్టలు చేసినందుకుగాను పోలీసులు కారును సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కారు యజమానికి రూ.6,500 ఫైన్ విధించారు.
https://twitter.com/SunilYadavRao/status/1663365880594714624