బామ్మా మజాకా!..ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేసింది
X
వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి రుజువు చేశారు ఓ బామ్మ. ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే పాడిన 'పియా తూ అబ్ తో ఆజా' పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ వేసి ఓ ప్రైవేట్ పార్టీలో ఇరగదీసింది. యంగ్ లేడీస్‌కు ఏమాత్రం తీసిపోకుండా పాటకు తగ్గట్లుగా లయబద్ధంగా బామ్మ స్టెప్పులు వేసి పార్టీకి వచ్చిన వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బామ్మ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో లేటెస్టుగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. సూపర్ బామ్మ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు.
ఓ పార్టీలో లేడీసంతా గుమిగూడారు. అక్కడ వారిని ఉత్సాహపరిచేందుకు ఈవెంట్ మేనేజర్లు ఓల్డ్ సాంగ్స్‌ను ప్లే చేశారు. ఈ క్రమంలో 'పియా తూ అబ్ తో ఆజా' అంటూ పాట మొదలవ్వగానే ఈ బామ్మ ఒంట్లో ఓ ఊపు మొదలైంది. ఇంకేముంది వయసును పక్కన పెట్టి తన ఎనర్జీనంతా ఏకం చేసి పాటకు తగ్గట్లుగా కాళ్లు కదుపుతూ ఈవెంట్‌ను షేక్ చేసేసింది. వృద్ధాప్యంలోనూ పవర్ ఫుల్ డ్యాన్స్ స్టెప్పులను సైతం సునాయాసంగా పెర్ఫార్మ్ చేయడంతో అక్కడున్న మహిళలు సైతం అవాక్కయ్యారు. ఈ పాటకు సినిమాలో డ్యాన్స్ చేసిన నటి హెలెన్‌కు తీసిపోని విధంగా అవే స్టెప్స్ వేసి అదరగొట్టింది. అందరి మతులు పోగొట్టింది. అందుకే మరి ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వగానే 1 మిలియన్‌కు పైగా వీక్షకులు చూశారు. ఆమె ఉత్సాహం, చిరునవ్వు, వినియోగదారులను విస్మయానికి గురి చేసింది. బామ్మ నృత్యంపై నెటిజన్లు ప్రేమను కురిపించారు