Home > వైరల్ > ఢిల్లీ మెట్రో సిత్రాలు.. యువజంటకు బామ్మ ఝలక్

ఢిల్లీ మెట్రో సిత్రాలు.. యువజంటకు బామ్మ ఝలక్

ఢిల్లీ మెట్రో సిత్రాలు.. యువజంటకు బామ్మ ఝలక్
X

ఢిల్లీ మెట్రో.. ప్రయాణికుల విచిత్ర పనులతో తరుచూ వార్తల్లో ఉంటుంది. ప్రయాణికుల వింత చేష్టలు, ప్రేమ ముద్దులు, కొట్లాటలు, రీల్స్ వంటి వాటితో వార్తల్లో నిలుస్తుంది. ఢిల్లీ మెట్రో హెచ్చరించినా.. ప్రయాణికులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఓ యువజంట చేసిన పనికి బామ్మకు కోపం వచ్చింది. దీంతో వారిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. కిటకిటలాడుతున్న ఓ బోగీలో ఓ పెద్దావిడ నిల్చోగా.. ఆమెకు ఎదురుగా యువ జంట నిల్చుంది. సందు దొరికినప్పుడుల్లా యువజంట చేసే పనులు బామ్మకు చిరాకు తెప్పించాయి. బోగీ నిండా ప్రయాణికులు ఉన్నప్పటికీ బుగ్గలు గిల్లుకుంటూ, కౌగిలించుకుంటూ యువజంట వారి పనిలో వారున్నారు. ఇదంతా చూసి ఆ బామ్మ ఒక్కసారిగా వారిపై విరుచుకపడింది.

‘‘గంట నుంచి చూస్తున్నా..మెట్రోలో ఏం పనులివి.. ఇలాంటివి బయటకు వెళ్లాక చేస్కోండి.. ఇంత మంది ప్రయాణిస్తున్న మెట్రో రైలులో కాదు’’ అని ఆ బామ్మ గట్టిగా అరిచింది. దీంతో ఆ యువజంట షాకైంది. చుట్టుపక్కల ఉన్నవారు కూడా యువజంట తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Updated : 8 Sept 2023 10:37 PM IST
Tags:    
Next Story
Share it
Top