చంద్రయాన్ 3 బడ్జెట్పై ఎలన్ మస్క్ ఆసక్తికర కామెంట్
X
జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ దేశం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. మరి కొన్ని గంటల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ ల్యాండింగ్ కానుంది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుంటూ దూసుకెళ్లిన చంద్రయాన్-3.. ఇవాళ సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై దిగనుంది. దీన్ని కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. మరోవైపు చంద్రయాన్ 3 బడ్జెట్పై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుండగా.. దానికి ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.
సుమారు 615కోట్ల ఖర్చుతో చంద్రయాన్-3 ప్రాజెక్టును ఇస్రో చేపట్టింది. దీంతో చంద్రయాన్ 3 బడ్జెట్ను నెటిజన్లు సినిమాలతో పోలుస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్‌స్టెల్లార్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టినట్లు ఓ నెటిజన్ అన్నాడు. ఇంటర్‌స్టెల్లర్‌కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగా చంద్రయాన్ 75 మిలియన్ డాలర్లతోనే విజయం సాధించిందని కామెంట్ చేస్తున్నారు.
ఒక మరో నెటిజెన్ ఆదిపురుష్ బడ్జెట్‌తో చంద్రయాన్ - 3ని పోల్చాడు. ఆదిపురుష్ 700కోట్లతో తెరకెక్కించారని.. కానీ దానికంటే తక్కువ బడ్జెట్తో చంద్రయాన్ 3ని బడ్జెట్ తక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోస్టులపై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ఇది మంచి పరిణామం అన్నారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం మస్క్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Good for India 🇮🇳!
— Elon Musk (@elonmusk) August 22, 2023