Home > వైరల్ > బీచ్ లో ఆటలాడుకున్న ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్

బీచ్ లో ఆటలాడుకున్న ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్

బీచ్ లో ఆటలాడుకున్న ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్
X

ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్, ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ బీచల్ లో కలిసి గెంతులేసారు. చేట్టపట్టాలేసుకుని తిరిగారు. చేతులు పట్టుకుని పరుగులు తీశారు. తమ మధ్య ఉన్న వైరాన్ని అంతా మర్చిపోయి ఫ్రెండ్స్ అయిపోయారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏంటిదంతా....వాళ్ళిద్దరూ బీచ్ లో ఆడుకోవడమేంటి? అదెలా సాధ్యమనుకుంటున్నారా....అక్కడే ఉంది కిటుకు అంతా.

మస్క్, మార్క్....ట్విట్టర్, థ్రెడ్ లతో కేజ్ ఫైట్ కు సిద్దమవుతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కలిసిపోయినట్లు నెట్ లో ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదెలా సాధ్యమయిందబ్బా అంటూ నోరు వెళ్ళబెడుతున్నారు. అక్కడే ఉంది మ్యాటర్ అంతా....ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ కలిసిపోయినట్లు కనిపిస్తున్న ఫోటోలు నిజం కాదు. ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినవి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అందరి ముఖాలను తయారుచెయ్యడం ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది. అందులో భాగంగానే వీళ్ళిద్దరివి కూడా చేశారు.

సర్ డోజ్ ఆఫ్ ది కాయిన్ అనే ఒక ట్విట్టర్ యూజర్ ఏఐతో ఈ ఫోటోలను రూపొందించారుట. ఈఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఇప్పటికి మిలియన్ల మంది చూశారు. లక్షల్లో లైక్ లు వచ్చాయి. దీన్ని ట్విట్టర్ బాస్ ఎలాస్ మస్క్ కూడా చూశారు. పగలబడి నవ్వుతున్న ఎమోజీని కూడా పోస్ట్ చేశారు. మస్క్, జుకర్ బర్గ్ నిజంగా కలుస్తారో లేదో తెలియదు కానీ....వాళ్ళిద్దరూ అలా కలిసి కనిపించాలని చాలా మంది అనుకుంటున్నట్టున్నారు. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తెగ వైరల్ చేసేస్తున్నారు.




Updated : 17 July 2023 2:16 PM IST
Tags:    
Next Story
Share it
Top