Home > వైరల్ > రిటైర్మెంట్ రోజు ఎమోషనల్ సీన్..ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం

రిటైర్మెంట్ రోజు ఎమోషనల్ సీన్..ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం

రిటైర్మెంట్ రోజు ఎమోషనల్ సీన్..ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం
X

సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియో నెటిజన్ల గుండెను పిండేస్తోంది. పదవీ విరమణ తీసుకున్న ఓ బస్సు డ్రైవర్ భావోద్వేగమైన విజువల్స్ అందరినీ కదిలిస్తున్నాయి. చివరి రోజు కావడంతో డ్రైవర్ స్టీరింగ్‎ను ముద్దాడి , బస్సును కౌగిలించుకుని తన వృత్తి మీద ఉన్న ప్రేమను ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. పదవీ విరమణ రోజు కన్నీటి పర్యంతమైన డ్రైవర్‎ను చూసి అతనికి పనిపట్ల ఎంతో అంకితభావం ఉందో తెలుస్తోందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ తన పదవీ విరమణ రోజు చివరిసారిగా బస్సును చూసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. బస్సును చూసుకుంటూ డ్రైవర్ కన్నీరు పెట్టుకున్న దృష్యాలు అందరి మనసులను కదిలించాయి. సంవత్సరాల తరబడి ఆ బస్సుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బస్సును కౌగిలించుకుని మదనపడిపోయారు. బస్సు స్టీరింగ్‎కు ముద్దుపెట్టి, క్లచ్, గేర్, బ్రేక్ ఇలా అన్నింటినీ తన చేతులతో తాకుతూ ఇదే చివరి రోజూ అంటూ భావోద్వేగమయ్యారు. తోటి ఉద్యోగులు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఇది కాస్త వైరల్ అయ్యింది. హార్ట్ టచింగ్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.




Updated : 2 Jun 2023 2:52 PM IST
Tags:    
Next Story
Share it
Top