Home > వైరల్ > కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..తండ్రి ఏం చేశాడో తెలుసా?

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..తండ్రి ఏం చేశాడో తెలుసా?

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..తండ్రి ఏం చేశాడో తెలుసా?
X

కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని పరువు హత్యలు చేసిన తల్లిదండ్రులను చూసుంటాం. లేదా ఆ బాధను తట్టుకోలేక తమ ప్రాణాలను విడిచిన పేరెంట్స్ కథలు వినుంటాం. కానీ తెలంగాణలోని మహబూబ్‎నగర్ జిల్లాకు చెందిన ఆ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురికి బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించారు.

తమ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జీర్ణించుకోలేకపోయిన వారు తీవ్ర మనస్థాపానికిగురై ఈ నిర్ణయం తీసుకున్నారు. గద్వాల్‎లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

డాక్టర్ సోమేశ్వరి , కానిస్టేబుల్‎ రాజశేఖర్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు. దీంతో యువతి తల్లిదండ్రలు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో ఈ మధ్యనే సోమేశ్వరి తాను ప్రేమించిన రాజశేఖర్‎ను పెళ్లి చేసుకుంది. దీంతో తమ కూతురు పెద్దలను ఎదురించి లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. బతికుండగానే తన కూతురిని చంపేశాడు. ఆమెకు ‘శ్రద్ధాంజలి’ ఘటిస్తూ పోస్టర్లు వేయించాడు. ఈ పోస్టర్లు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.





Updated : 3 July 2023 7:15 PM IST
Tags:    
Next Story
Share it
Top