మనిషేనా? 100 పచ్చి గుడ్లను తాగాడు.. వీడియో వైరల్
X
గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎగ్ ఫ్రైకి బదులు బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం మంచిందని కొందరంటారు. మరికొందరైతే పచ్చి గుడ్డు తాగితే మరింత బలమంటారు. పచ్చి గుడ్డు నీచు వాసన కొడుతుంది కాబట్టి జనం దానికి దూరంగానే ఉంటారు. అయితే బాడీ బిల్డర్లకు అదో ఫేవరేట్ ఫుడ్ ఐటమ్. ఎంత మల్లయోధుడైనా సరే పచ్చిగుడ్లను రెండు మూడకంటే ఎక్కవ తాగలేడు. మహా అయితే పది, ఇరవై. కానీ ఓ జిమ్ యోధుడు ఏకంగా 100 పచ్చిగుడ్లను గుటుక్కున మింగి వైరల్ అయ్యాడు. వంద గుడ్లను పగలగొట్టి ఓ పెద్ద మగ్గులో వేసుకుని బీరు సీసా ఎత్తినట్లు కడుపులోకి తోసేశాడు. మధ్యలో కాసేపు ఆగి మళ్లీ లాగించారు. చివరికొచ్చేసరికి కడుపు పగిలి వాంతికొచ్చే ఫీలింగ్ పెట్టినా మొత్తానికి టార్గెట్ పూర్తి చేశాడు.
అతిని పేరు విన్స్ ఇయోన్. ఫిట్‌నెస్‌పై యూట్యూబ్‌లో వీడియోలు చేసే వన్స్ తన యూట్యూబ్ చానల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య లక్ష దాటిందన్న సంబంరంతో ఈ సాహసానికి దిగాడు. జిమ్‌లో అందరూ చూస్తుండగా గుడ్లను మింగేశాడు. మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి కొన్ని బస్కీలు తీసి మళ్లీ తాగాడు. అన్ని గుడ్లు అతని కడుపులో ఎలా పట్టాయని అక్కడున్న జనం ఆశ్చర్యంతో చూశారు. స్ట్రాంగ్ బాడీ అని కొందరు మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి పనులతో ప్రాణాలే పోతాయని, విన్స్‌ను ఎవరూ అనుకరించొద్దని నెటిజన్లు చెబుతున్నారు. అన్ని పచ్చి గుడ్లు అరగవని, అతని వాష్ రూంలోకి వెళ్లి కక్కేసి ఉంటాడని అంటున్నారు.