వరదలో కొట్టుకుపోయిన గ్రామం-భయపెడుతున్న వీడియో
X
హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు మంచెత్తుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజులు కురిసే అంచనాలున్నాయి. కానీ ఇప్పటికే కురిసిన కుండపోత వలన అక్కడి నదులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి. వరద నీళ్ళే నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి.
వరదల నేపథ్యంలో వచ్చిన ఓ వీడియో అందరినీ భయపెడుతోంది. వరద నీటిలో ఏకంగా ఒక గ్రామమే కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో కొండవాలులో ఉండే మండి అనే జిల్లాను వరద నీరు చుట్టుముట్టింది. పై నుంచి వచ్చిన వరద నీరు గ్రామంలో ఉన్న ఇళ్ళను ఊడ్చుకువెళ్ళిపోయింది. పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించేసింది. ఇదంతా వీడియోలో కనిపిస్తోంది. ఇవి అత్యంత భయపెట్టేవిగా ఉన్నాయి.
మూడు రోజుల ఎడతెగని వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వలన ఇప్పటికి 28మంది చనిపోయారు. మరింత మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. మరో రెండు రోజులు ఇలాగే వానలు పడతాయని చెప్పడం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
#Video| Continuous rain for 3 days wreaks havoc in #HimachalPradesh's Mandi pic.twitter.com/HieNQW5fm2
— NDTV (@ndtv) July 10, 2023