Home > వైరల్ > బుల్లెట్ బండి ఇయ్యలేదని పెండ్లి క్యాన్సిల్.. 50 మందిపై కేసు

బుల్లెట్ బండి ఇయ్యలేదని పెండ్లి క్యాన్సిల్.. 50 మందిపై కేసు

బుల్లెట్ బండి ఇయ్యలేదని పెండ్లి క్యాన్సిల్.. 50 మందిపై కేసు
X

చిన్న చిన్న కారణాలతో పెండ్లిళ్లు క్యాన్సిల్ చేసుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. డీజే నచ్చలేదని ఒకరు, విందు భోజనాలు బాగాలేవని మరొకరు, రంగు తక్కువున్నారని ఇంకొకరు.. ఇలా సిల్లీ రీజన్స్ తో పెళ్లి మండపం నుంచి వెళ్లిపోతున్నారు. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కోరుకున్న బైక్ కట్నంగా ఇవ్వలేదని ఓ వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో చిర్రెత్తిన వధువు తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పెండ్లికొడుకుతో పాటు మరో 50 మంది కటకటాలు లెక్కపెడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని నౌరంగాబాద్‌ కు చెందిన మోతీలాల్‌ తన కుమార్తె వివాహం పక్క గ్రామానికి చెందిన మున్నా సింగ్ కుమారుడు బాదల్ తో నిశ్చయించాడు. జూన్ 18న ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే ఆ రోజున మగ పెండ్లివారు ఊరేగింపుగా పెండ్లి మండపానికి చేరుకున్నారు. వారికి వధువు బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

పెళ్లి తంతు మొదలయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్నం కోసం డిమాండ్‌ చేశారు. కట్నంగా బుల్లెట్‌ బండితో పాటు మరో లక్ష నగదు ఇస్తేనే తాళి కడతానని పెండ్లి కొడుకు బీష్మించుకున్నాడు. ఆడపెళ్లి వారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే వరుడు కోరినవి ఇవ్వలేమని వధువు తల్లిదండ్రులు చెప్పడంతో మగపెళ్లివారు తిరిగి వెళ్లిపోయారు.

పెండ్లి చేసుకోకుండానే మగ పెళ్లివారు వెనుదిరగడంతో వధువు తండ్రి మోతీలాల్ వారిపై రూరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుల్లెట్ బండితో పాటు లక్ష నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారని అందులో రాశాడు. మోతీలాల్ కంప్లైంట్ ఆధారంగా కేసు బుక్ చేసిన పోలీసులు పెండ్లికొడుకు బాదల్, అతని తండ్రితో పాటు మరో 50 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 22 Jun 2023 12:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top