Home > వైరల్ > 51 ట్రాక్టర్లతో వధువు ఇంటికి వరుడు ..వీడియో వైరల్

51 ట్రాక్టర్లతో వధువు ఇంటికి వరుడు ..వీడియో వైరల్

51 ట్రాక్టర్లతో వధువు ఇంటికి వరుడు ..వీడియో వైరల్
X

పెళ్లి..జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే వేడుక. ఈ వేడుకను మధురమైన జ్ఞాపకంగా ఉంచుకునేందుకు నేటి యువత తాపత్రాయపడుతున్నారు. తమ వివాహాన్ని నలుగురు చెప్పుకునే విధంగా, వినూత్నంగా జరగాలని కోరుకుంటున్నారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత ఉండే విధంగా కళ్యాణాన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఓ పెళ్లి ఊరేగింపు వార్తల్లో నిలిచింది.

బార్మర్‌లోని గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహమైంది. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రోజున వరుడుతో సహా 200 మంది అతిథులు 51 ట్రాక్టర్లలో వధువు ఇంటికి వచ్చారు. వరుడు మొదట ట్రాక్టర్‌ను డ్రైవ్ చేయగా..అతనిని మిగతా 50 ట్రాక్టర్లు ఫాలో అయ్యాయి. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు క్యూలైన్లో రావడాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తమది వ్యవసాయ కుటుంబం కావడంతోనే ట్రాక్టర్లతో ఊరేగింపుగా వచ్చామని వరుడు తెలిపాడు. ఇంట్లో అందరూ వ్యవసాయం చేస్తారని చెప్పాడు. తన తండ్రి ఊరేగింపు కూడా ట్రాక్టర్‌తోనే జరిగిందని వివరించాడు.


Updated : 14 Jun 2023 6:19 PM IST
Tags:    
Next Story
Share it
Top